శరీర నిర్మాణంలో ఎముకలు కీలక పాత్ర వహిస్తాయి. బాడీలో ఏ పార్ట్ లో నైనా ఎముకలు విరిగితే.. మళ్లీ ఆ పార్ట్ పని చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. శరీరానికి కావాల్సిన కాల్షియం లేకపోయినా సమస్యలే.. ఎక్కువ అయినా సమస్యలే. కాబట్టి తగిన మోతాదులో కాల్షియం తీసుకోవడం అవసరం. ఏదో కడుపు నిండుతుంది అనుకుంటే సరిపోదు. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందించాలి. అప్పుడప్పుడు శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని గమనించి.. తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.
అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ రావడం సర్వ సాధారణం. కానీ కంటిన్యూగా బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, బరువు తగ్గడం వంటికి కూడా కాల్షియం లేకపోవడం వల్లనే. నార్మల్ గా వయసు పైబడిన వారికి ఇలా రావడం సహజం. కానీ వయసులో ఉన్నవారికే వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. మన శరీరంలో కాల్షియం తక్కువ అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఎముకలు, దంతాలకు కాల్షియం చాలా అవసరం.
అలసట, సోమరితనం:
శరీరంలో ఎముకలు బలహీనం అయితే అలసట, సోమరితనం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసినప్పటికే ఎంతో అలసిపోయినట్టు ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. దేని మీద ధ్యాస పెట్టరు. బాడీలో కాల్షియం తక్కువగా ఉంటే రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. పదే పదే ఆలోచిస్తూంటారు. ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాల్షియం తక్కువ అయితే శ్వాస కోశ, ప్రేగుల్లో ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కండరాల తిమ్మిర్లు:
ఎముకలు, దంతాలకు మాత్రమే కాదు కండరాలకు కూడా కాల్షియం చాలా అవసరం. కండరాలు హెల్దీగా ఉండాలంటే వాటికి కాల్షియం అందాల్సిందే. లేదంటే తిమ్మిర్లు వస్తూంటాయి. కాల్షియం తక్కువగా ఉంటే చేతుల నొప్పులు, తొడ కండరాలు నొప్పిగా ఉంటాయి.
ఎముకల బలహీనత:
కాల్షియం తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. శరీరంలో ఎక్కడైనా చిన్న దెబ్బలు తగిలినా ఎముకలు ఊరికే విరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గోర్లు కూడా వాటంతట అవే విరిగి పోతూ ఉంటాయి.
పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పి:
సాధారణంగా నెలసరి సమయంలో ఎవరికైనా కడుపులో నొప్పి వస్తుంది. అందరూ అలానే అనుకుంటారు. కానీ కాల్షియం లోపం ఉంటే పీరియడ్స్ సమయంలో వారికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. భరించలేనంత పెయిన్ వస్తుంది. ఎక్కువగా బ్లడ్ అవ్వడం, నొప్పి వస్తూంటాయి. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఈసారి ఇలానే ఉంటే మీరు వైద్యులను సంప్రదించడం మేలు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.