Heart Health: గుండెపోటు అకస్మాత్తుగా రాదు.. 10 రోజుల ముందే మీ శరీరం ఇచ్చే ఈ ‘డెడ్లీ’ సిగ్నల్స్ ఇవి

ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన గుండెపోటు, ఇప్పుడు పాతికేళ్ల యువకులను కూడా బలితీసుకుంటోంది. జిమ్‌లో వర్కౌట్ చేస్తూనో, నడుస్తూనో అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా రాదని, మన శరీరం వారం పది రోజుల ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తుందని సైన్స్ చెబుతోంది. హార్వర్డ్ హెల్త్ వెల్లడించిన ఆ ప్రాణాంతక హెచ్చరిక సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..

Heart Health: గుండెపోటు అకస్మాత్తుగా రాదు.. 10 రోజుల ముందే మీ శరీరం ఇచ్చే ఈ డెడ్లీ సిగ్నల్స్ ఇవి
Heart Attack Warning Signs

Updated on: Mar 18, 2026 | 7:26 PM

గుండె రక్తనాళాల్లో పూడికలు (Blocks) ఏర్పడినప్పుడు శరీరం వింతగా స్పందిస్తుంది. ఆ సంకేతాలను మనం సాధారణ అలసటగానో లేదా అజీర్తిగానో భ్రమపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం. మహిళల్లో అసాధారణ అలసట, పురుషుల్లో ఆయాసం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే మృత్యువు నోటి నుండి బయటపడవచ్చు. మరి మీ గుండె ఇచ్చే ఆ 5 రహస్య సంకేతాలు ఏంటి? వైద్యులు సూచిస్తున్న తక్షణ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. అసాధారణ అలసట (Extreme Fatigue):

ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా, రోజంతా విపరీతమైన నీరసంగా అనిపిస్తుంటే అది గుండెకు రక్త ప్రసరణ తగ్గుతోందనడానికి మొదటి గుర్తు. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.

2. కొద్ది దూరం నడిచినా ఆయాసం:

ఒకప్పుడు సులభంగా నడిచిన దూరాన్ని ఇప్పుడు నడవలేకపోవడం, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గుతోందని సూచిస్తుంది.

3. జీర్ణ సమస్యలు & వికారం:

చాలామంది గుండెల్లో మంటను (Heartburn) గ్యాస్ సమస్యగా పొరబడతారు. కానీ అకస్మాత్తుగా వచ్చే వికారం, వాంతులు అజీర్ణం గుండెపోటుకు ముందస్తు సంకేతాలు కావచ్చు.

4. నిద్రలేమి, ఆందోళన:

రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, కారణం లేకుండానే విపరీతమైన ఆందోళన (Anxiety) కలగడం గుండె ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పడానికి మెదడు ఇచ్చే సంకేతం.

5. వివిధ భాగాల్లో నొప్పి:

నొప్పి కేవలం ఛాతీలోనే ఉండదు. ఎడమ చేయి, దవడ ఎముక, వీపు భాగం లేదా మెడలో ఆకస్మికంగా నొప్పి వచ్చినా వెంటనే అప్రమత్తం కావాలి.

ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

నిర్లక్ష్యం వద్దు: పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి ECG, 2D Echo పరీక్షలు చేయించుకోవాలి.

గోల్డెన్ అవర్: గుండెపోటు వచ్చిన మొదటి గంట చాలా కీలకం. ఏమాత్రం అనుమానం ఉన్నా సొంత వైద్యం చేసుకోకుండా ఆసుపత్రికి వెళ్లడం ఉత్తమం.

జీవనశైలి మార్పు: సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం ప్రతిరోజూ 30 నిమిషాల నడక మీ గుండెను ఉక్కులా మారుస్తాయి.

మీ కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ప్రాణరక్ష!

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఇది ఇంటర్నెట్ నివేదికల ఆధారంగా రూపొందించబడింది, వైద్య సలహా కోసం డాక్టరును సంప్రదించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us