Covid 19: ఇప్పుడు నిరాశ కలిగించినా భవిష్యత్‌లో శక్తివంతమైన ఆయుధం అదే.. నాసల్ టీకాపై నిపుణుల అభిప్రాయం ఇదే..

|

Oct 19, 2022 | 12:13 PM

ఆస్ట్రాజెనెకా నాసల్ స్ప్రే ట్రయల్ ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ, కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడటంతో నాసల్ వ్యాక్సిన్స్ అత్యంత శక్తివంతంగా నిలుస్తాయని..

Covid 19: ఇప్పుడు నిరాశ కలిగించినా భవిష్యత్‌లో శక్తివంతమైన ఆయుధం అదే.. నాసల్ టీకాపై నిపుణుల అభిప్రాయం ఇదే..
Nasal Spray
Follow us on

ఆస్ట్రాజెనెకా నాసల్ స్ప్రే ట్రయల్ ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ, కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడటంతో నాసల్ వ్యాక్సిన్స్ అత్యంత శక్తివంతంగా నిలుస్తాయని చెబుతున్నారు నిపుణులు. భవిష్యత్‌లో ఈ నాసల్ స్ప్రే చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ఈ నాసల్ స్ప్రే.. వైరస్ మాదిరిగానే శరీరంలోకి ప్రవేశించి.. ముక్కు, నోటిలో ఉండే శ్లేష్మ పొరలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది ప్రజలు వ్యాధి బారిన పడకుండా ముందుగానే నిరోధించవచ్చు. కోవిడ్ ఉన్నవారికి మరింత వ్యాప్తి చెందకుండా ఈ నాసల్ స్ప్రే అడ్డుకుంటుంది. అయితే, ఇది తీవ్రమైన కోవిడ్‌ను అడ్డుకోవడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని పరీక్షల్లో తేలింది. అయితే, వైరస్ వ్యాప్తిని నివారించడంలో తక్కువ సామర్థ్యం కనబరిచింది.

ఇకపోతే గత నెలలో ఇంజక్షన్ రహిత కోవిడ్ వ్యాక్సిన్‌‌కు చైనా ఆమోదం తెలిపింది. ఇలా ఇంజక్షన్ రహిత కోవిడ్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన తొలి దేశంగా చైనా నిలిచింది. ఇది నెబ్యులైజర్ పరికరాన్ని ఉపయోగించి ముక్కు, నోటి ద్వారా పీల్చే ఏరోసోలైజ్డ్ పొగమంచు. ఆ తరువాత కొద్ది రోజులకు మన భారతదేశం స్వదేశీ నాసల్ డ్రాప్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. ఇక పాశ్చాత్య దేశాలు ఎప్పుడు ఈ నాసల్ స్ప్రే ని అందుబాటులోకి తీసుకువస్తాయా? అని ఎదురు చూస్తుండగా.. గత వారం ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ఉపయోగించి సాధారణ నాసికా స్ప్రే ఫస్ట్ పేజ్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.

సాంప్రదాయ టీకాలతో పోలిస్తే నాసల్ స్ప్రే రోగనిరోధక ప్రతిస్పందనలు బలహీనంగా ఉన్నాయని eBioMedicine జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. ‘మేము ఆశించిన విధంగా ఈ అధ్యయనంలో నాసిక స్ప్రే సరైన ఫలితాలనివ్వలేదు.’ అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రయల్స్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ శాండీ డగ్లస్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, నాసల్ స్ప్రే విషయంలో చైనా వెల్లడించిన డేటా ఇందుకు భిన్నంగా ఉంది. నెబ్యూలైజర్ పరికరంతో ఊపిరితిత్తులలోకి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని సూచించింది. నాసిక స్ప్రే వ్యాక్సిన్‌లో ఎక్కువ భాగం మింగడం, కడుపులోకి వెళ్తుంది. ఊపిరితుత్తలకు వైరస్ సోకకుండా కడుపులోనే అంతమొందిస్తుందని క్వీన్స్ యూనివర్సిటీ బెల్‌ఫాస్ట్‌లోని వైరాలజిస్ట్ కానర్ బామ్ ఫోర్డ్ పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా ఫలితాల గురించి అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నాసికా స్ప్రే ఎందుకు తక్కువ ఫలితాలను చూపిందో పరిశోధిస్తే.. భవిష్యత్ లో మరింత ప్రభావవంతంగా పని చేసే విధంగా పరిశోధనలు జరుపడంలో సహాయపడుతుందన్నారు.

‘ఆస్ట్రాజెనెకాలా కాకుండా.. పోలియో, రోటవైరస్, ఇన్‌ఫ్లుఎంజా వంటి ఇతర వ్యాధులకు ఉపయోగించే విజయవంతమైన నాసికా వ్యాక్సిన్‌లు అన్నీ లైవ్ వ్యాక్సిన్‌లు. అంటే అవి ముక్కు లోపల ప్రతిరోధకాలుగా మారుతాయి.’ అని బామ్‌ఫోర్డ్ వివరించారు. ఇది పరిశోధకులకు మార్గాన్ని చూపుతుందన్నారు. పారిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ జార్జెస్ పాంపిడౌకు చెందిన ఇమ్యునాలజిస్ట్ ఎరిక్ టార్టూర్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రాజెనెకా ఫలితాలు నిజంగా నిరాశపరిచాయి. అయితే, ఇది నాసికా వ్యాక్సిన్‌లపై ఆశను తగ్గిస్తుందని అని తాను భావించడం లేదు.’ అని అన్నారు.

ఆస్ట్రాజెనెకా, చైనా, ఇండియాకు చెందిన నాసికా వ్యాక్సిన్‌లు ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలను చూపించలేదని, ఇది ఒక విధంగా అభయమిచ్చిందని ఆయన అన్నారు. గత నెలలో ఆరోగ్య డేటా సంస్థ ఎయిర్‌ఫినిటీ అండ్ నేచర్ విశ్లేషణ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 100 వేర్వేరు ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్లు ఇప్పటికే మనుషులపై పరీక్ష చేశారు. రష్యా, ఇరాన్ కూడా నాసికా వ్యాక్సిన్‌లను ఆమోదించాయి.

అయితే, చైనా, భారతదేశం మాదిరిగా వారు తమ టీకా కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు చూపించే ట్రయల్ డేటాను పీర్-రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురించలేదు. ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న టీకా రేట్లు, కొన్ని దేశాలు మిలియన్ల కొద్దీ గడువు ముగిసిన టీకాలను ధ్వంసం చేస్తున్నాయి. కొత్త కోవిడ్ వ్యాక్సిన్ కోసం డిమాండ్ కూడా పెద్దగా లేకపోవడం విశేషం.

2020లో ఫ్రాన్స్‌కు చెందిన పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్, బయోటెక్ సంస్థ థెరావెక్టీస్ నాసికా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ఇది జంతువులపై జరిపిన పరీక్షలలో వివిధ రకాలైన ప్రతిరోధకాలను పెంచింది. చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పియరీ చార్నో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ను మనుషులపై ట్రయల్స్ నిర్వహించడానికి సదరు ఏజెన్సీల నుంచి తగినంత ఆసక్తి రాలేదు. సంస్థ క్యాన్సర్ వ్యాక్సిన్‌ల వైపు దృష్టి సారించిందన్నారు.

యుఎస్ బయోటెక్ సంస్థ మీసా వ్యాక్సిన్‌లు మనుషులపై ఫేజ్ 1 ట్రయల్స్‌ నిర్వహించగా, మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మార్టిన్ మూర్ వెల్లడించారు. నాసిక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరెంతో సమయం లేదన్నారు. మొదటి దశ కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ప్రోత్సహం లభించినట్లుగా.. నాసికా వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రపంచ వ్యాప్తంగా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని మూర్ అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత వేగంగా ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే ఈ నాసికా వ్యాక్సిన్‌ను డెవలప్ చేయడం జరిగిందన్నారు. వైరస్‌ను నియంత్రించడంలో ఇది అద్భుతంగా పని చేస్తుందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయ్యాయని, పాశ్చాత్య దేశాలు మేల్కొని వ్యాక్సిన్ తయారీకి నాయకత్వం వహించాలని కోరారు మూర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..