Food Diet Tips: ప్రస్తుత ట్రెండ్ డైటింగ్..! డైటింగ్ చేసేటప్పుడు ఈ లాజిక్ మిస్సైతే అంతే సంగతులు..!

Updated on: Nov 18, 2022 | 9:58 AM

మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.


మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ.. డైటింగ్ చేస్తున్నారు. రోజూ తినే ఆహారంలో.. సమయం.. పరిమాణంలో అనేక మార్పులు చేసుకుని.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత మంది ఈడైటింగ్ ను పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతుంటే మరికొంత మంది ఏదో నామ్‌ కే వాస్తే అన్నట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది ప్లాన్ ప్రకారం డైటింగ్ చేస్తున్నా.. ఫలితం మాత్రం కన్పించదు. ఎందుకంటే ఈడైటింగ్ లో కొన్నిసార్లు చిన్న చిన్న లాజిక్ లు మిస్సవుతుంటారు. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ టైమ్ లోనే ఈడైటింగ్ టిప్స్‌ను ఫాలో అవుతూ ఉంటారు. డైటింగ్ చేసేవారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే చేసేస్తే క్యాలరీలు సమర్థవంతంగా ఖర్చు చేయవచ్చు. తద్వారా బరువు తగ్గించుకోవచ్చు అనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అల్పాహారం అంటేనే అల్పంగా, తక్కువ పరిమాణంలో తీసుకునేది అని అర్థం. తాజా అధ్యయనంలో రోజులో ఎక్కువ మొత్తంలో ఆహారం ఏ సమయంలో తిన్నప్పటికీ, అది బరువును ఎంత మాత్రం ప్రభావితం చేయదు. అల్పాహారం ఎక్కువ మొత్తంలో తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని పరిశోధనలో వెల్లడైంది. అందుకే డైటింగ్ చేసేటప్పుడు మన సందేహాలను డైటీషియన్స్ లేదా ఆరోగ్య నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. వారి సలహాలు, సూచనల ప్రకారం సరైన పద్ధతిలో డైటింగ్ చేస్తే మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Nov 18, 2022 09:57 AM
Loading...
Unable to load recommendations.
Follow Us