Food Adulteration: కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా? జన్మలో తప్పించుకోలేరు..

|

Nov 22, 2024 | 9:23 PM

మార్కెట్లో ఏది కొన్నాలన్నా భయం వేస్తుంది. పాల నుంచి ఉప్పు వరకు కల్తీ రాయుళ్లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. కల్తీ ఆహారం తింటే మూత్ర పిండాలు, కిడ్నీలు త్వరగా పాడైపోతాయి. ఇలాంటి ఆహారాన్ని కల్తీ మయం చేసి సొమ్ము చేసుకుంటున్న మోసగాళ్లను శిక్షించడానికి మన న్యాయ వ్యవస్థలో కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Food Adulteration: కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా? జన్మలో తప్పించుకోలేరు..
Food Adulteration
Follow us on

ప్రస్తుతం అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. కొందరు కల్తీరాయుళ్లు అధిక లాభాలకు కక్కుర్తిపడి ఆహార పదార్థాలను విషతుల్యం చేస్తున్నారు. దీంతో ప్రస్తుత రోజుల్లో పాల నుంచి పప్పు, ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ మయం అవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్న ఏదో ఒక రూపంలో కల్తీ మన ఇంట్లోకి చేరుతుంది. పలుచోట్ల ఇలాంటి సంఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కల్తీ, ఆహార భద్రతకు సంబంధించిన విషయాల కోసం మనదేశంలో ఆహార భద్రత, నాణ్యత చట్టం కూడా తయారుచేశారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కూడా కల్తీ ఆహారాలపై కొరడా విసరుతుంది. అయినా యదేచ్ఛగా కల్తీ దందా సాగుతుంది.

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆహారంలో కల్తీ ఆగడం లేదు. ఈ విషయం తెలియని వారు రోజూ ఏదో ఒక రూపంలో కల్తీ ఆహారాన్ని తింతున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా రకరకాల రోగాలు కూడా వస్తాయి. ఆహార పదార్థాలు కల్తీ చేయడం చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయి? ఎవరైనా నిషిద్ధమైన, కల్తీ ఆహారాలను విక్రయిస్తూ పట్టుబడితే శిక్ష ఏమిటి? వంటి పూర్తి సమాచారం మీకోసం..

కల్తీ ఆహారం విక్రయిస్తూ పట్టుబడితే శిక్ష ఏమిటి?

ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్, 2006 ప్రకారం.. ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం వంటివి చేస్తూ పట్టుబడితే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. నేరారోపణపై జరిమానా, శిక్ష.. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే, అటువంటి కేసులకు 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే, కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఇవి కూడా చదవండి

కల్తీ ఆహారాలకు దూరంగా ఉండటం ఎలా?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం, మంచి జీవనశైలిని అవలంబించడంతో పాటు, ఆహార ఎంపికలు కూడా చాలా ముఖ్యమైనవి. వీలైనంత వరకు కల్తీ లేని పదార్థాలను తీసుకోవాలి. మీకు దాని గురించి పెద్దగా తెలియకపోతే సహజ పదార్థాలను తీసుకోవడం మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మీకు కావలసిన పండ్లు, కూరగాయలు వంటి వంటింటి కూరగాయలను ఇంటి పెరట్లోనే పండించుకోవచ్చు. పిండిని మిల్లుల నుంచి తెచ్చుకోవచ్చు. ఇలా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వీలైనంత కల్తీ ఆహారానికి దూరంగా ఉండవచ్చు. అలాగే వీలైనంత వరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలాగే బయటి భోజనానికి దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.