Honey: చక్కెర బదులు తేనె వాడటం కరెక్టేనా? ఇదిగో సమాధానం..

తేనెటీగలు పుష్పాల నుంచి.. మకరందాన్ని సేకరించి తేనెతుట్టెలో దాచుకుంటాయి. దీన్నే తేనె అంటారు. తేనె వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఆ తేనెను ఎంత నాణ్యమైన పుష్పాల నుంచి తేనేటీగలు సేకరించాయనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అయితే పంచదార బదులు తేనె వాడటం మంచిదేనా..?

Honey: చక్కెర బదులు తేనె వాడటం కరెక్టేనా? ఇదిగో సమాధానం..
Honey
Follow us

|

Updated on: Apr 15, 2024 | 7:04 PM

ఈ మధ్య కాలంలో జనాల ఫుడ్ అలవాట్లు బాగా మారిపోయాయి. కరోనా తర్వాత ప్రజలంతా ఆరోగ్యంపై కేర్ తీసుకోవడం మొదలెట్టారు. అందులో భాగంగానే.. ఈ మధ్యకాలంలో తేనె వినియోగం విపరీతంగా పెరిగింది. ఆయుర్వేదంలో తేనె ప్రాముఖ్యత అధికంగా ఉండటంతో.. దానివైపు జనాలు ఫోకస్ మళ్లింది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, అమినో ఆసిడ్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. దీనిలో ఉండే ఫ్రక్టోజ్ తేనెను పంచదార కంటే ఎక్కువ తీయగా చేస్తుంది. 20గ్రాములు తేనెలో.. 58 కిలోకేలరీలు, 15.4 గ్రాముల చక్కెర, 15.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.1 ప్రొటీన్ ఉంటాయి. వేడి చేయని ముడి తేనె ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ చేయడం వల్ల తేనె తన పోషక విలువలను కోల్పోతుందని అంటున్నారు.

కాగా తేనె.. జీఐ తక్కువగా ఉండటం వల్ల.. బ్లడ్ షుగర్ స్థాయులను పంచదార అంత త్వరగా పెంచదు. అయితే చక్కెరతో పోలిస్తే  తేనెలో కేలరీల పాళ్లు మాత్రం అధికం. మీరు తేనెను వాడదలుచుకుంటే ఎక్కువగా ముడి తేనెను కొనుగోలు చేసేందుకు యత్నించండి. తేనెను నిర్ణీత మోతాదులో తీసుకోవడం అందరికీ మంచిదే. అయితే చిన్నప్పుడు పిల్లలకు తేనె పట్టడం ఇప్పుడు ఓ అలవాటుగా మారిపోయింది. వాస్తవానికి  ఏడాదిలోపు పిల్లలకు తేనె తినిపించకూడదట. ఇలా చేస్తే.. ఆహారం విషపూరితం అయ్యే చాన్స్ ఉందట.

తేనెను యాంటీసెప్టిక్‌గా పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది గాయాలు, దెబ్బలను ఇది త్వరగా నయం చేస్తుందని నమ్ముతారు. తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మిళతమై ఉండటమే దీనికి కారణం. గాయం అయిన చోట.. తేనె పూస్తే.. అది అక్కడ నీటిని పీల్చుకుని, గాయం త్వరగా ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల గాయంపైన ఫంగస్, బ్యాక్టీరియా వంటివి పెరిగేందుకు చాన్స్ ఉండదు. అయితే ముదురు వర్ణంలో తేనె అయితే గాయాలకు చాలా బెటర్. ఇందిలోని ఫ్లేవనాయిడ్స్‌ యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అలర్జీ, యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. ఫాలో అయ్యేముందు మీ ఫ్యామిలీ డాక్టర్‌ను లేదా డైటీషియన్లను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..