Frequent Sneezing: తరచుగా తుమ్ములు వస్తున్నాయా.? ఇది దేనికి సంకేతమో తెలుసా..?

రోజులో ఒక్కసారో రెండుసార్లో తుమ్మడం సాధారణ విషయమే. కానీ రోజూ, పదే పదే, ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే లేదా దుమ్ము, వాసన, చలి తగిలినప్పుడు తుమ్ములు వస్తుంటే చాలామంది ఆందోళన చెందుతుంటారు. నిజంగా తరచుగా తుమ్ములు రావడం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతమేనా? నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Frequent Sneezing: తరచుగా తుమ్ములు వస్తున్నాయా.? ఇది దేనికి సంకేతమో తెలుసా..?
Sneezing

Updated on: Feb 02, 2026 | 3:07 PM

రోజులో ఒక్కసారో రెండుసార్లో తుమ్మడం సాధారణ విషయమే. కానీ రోజూ, పదే పదే, ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే లేదా దుమ్ము, వాసన, చలి తగిలినప్పుడు తుమ్ములు వస్తుంటే చాలామంది ఆందోళన చెందుతుంటారు. కొందరు ఒకేసారి అనేకసార్లు తుమ్ములు తుమ్ముతుంటారు. దీంతో వారిలో “నాకు రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గిపోయిందా?” అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. నిజంగా తరచుగా తుమ్ములు రావడం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతమేనా? నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. తుమ్ము అనేది మన శరీరంలోని ఒక సహజ రక్షణ చర్య. ముక్కులోకి దుమ్ము, అలెర్జీ కారకాలు, బ్యాక్టీరియా లేదా వైరస్‌లు ప్రవేశించినప్పుడు, వాటిని బయటకు పంపడానికి శరీరం తుమ్ము ద్వారా స్పందిస్తుంది. అంటే, తుమ్మడం అనేది శరీరం పనిచేస్తున్న సంకేతమే తప్ప, తప్పనిసరిగా బలహీనతకు గుర్తు కాదు.

తరచుగా తుమ్ములు రావడానికి ప్రధాన కారణాలు

1. అలెర్జీలు (Allergic Rhinitis).. ఇదే అత్యంత సాధారణ కారణం. దుమ్ము, పుప్పొడి (పోలెన్), పెంపుడు జంతువుల వెంట్రుకలు, చలి గాలి, ఇవన్నీ తుమ్ములను ప్రేరేపిస్తాయి.

2. వాతావరణ మార్పులు.. ఒక్కసారిగా చలి నుంచి వేడికి లేదా వేడి నుంచి చలికి మారితే ముక్కులోని నరాలు స్పందించి తుమ్ములు వస్తాయి.

3. సైనసైటిస్ లేదా ముక్కు సమస్యలు.. సైనస్ ఇన్‌ఫెక్షన్, ముక్కులో వాపు ఉండటం వల్ల కూడా తుమ్ములు ఎక్కువవుతాయి.

4. వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. జలుబు, ఫ్లూ మొదలైనవి ఉన్నప్పుడు తుమ్ములు సహజం.

5. కాలుష్యం, రసాయన వాసనలు.. పెర్ఫ్యూమ్స్, సిగరెట్ పొగ, కెమికల్స్ కూడా తుమ్ములకు కారణం కావచ్చు.

ఇది నిజంగానే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతమా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కొంతవరకు నిజమే. తరచూ తుమ్మడం అనేది ఎక్కువగా అలెర్జీ లేదా పర్యావరణ కారణాల వల్లే జరుగుతుంది. బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నవారికి సాధారణంగా.. తరచూ జలుబులు, ఇన్‌ఫెక్షన్లు త్వరగా రావడం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడటం, నిరంతర అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.కేవలం తుమ్ములే ఉన్నాయంటే అది ఇమ్యూనిటీ తక్కువగా ఉందని చెప్పలేం.

కానీ, తరచుగా తుమ్మడం, పునరావృత జలుబు, గొంతు నొప్పి, అలసట లేదా తరచుగా అనారోగ్యాలు రావడం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతాలు. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, శరీరం బాహ్య అలెర్జీ కారకాలు, వైరస్లతో సమర్థవంతంగా పోరాడలేకపోతుంది. అందువల్ల, లక్షణాలు పదేపదే సంభవిస్తాయి.

అయితే ఎప్పుడు జాగ్రత్త అవసరం?

2–3 వారాలకుపైగా తుమ్ములు తగ్గకపోవడం. ముక్కు నుంచి పచ్చ లేదా పసుపు రంగు స్రావం, జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రివేళ దగ్గు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలుంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చేయాల్సిందేమిటి?

పోషకాహారం, పండ్లు, కూరగాయలు, విటమిన్ C ఉన్న ఆహారం (నిమ్మ, ఉసిరి), గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. రోజుకు కనీసం 7–8 గంటలు నిద్ర అవసరం. నడక, యోగా, శ్వాస వ్యాయామాలు ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ఉపయోగించడం మంచిది.

తరచుగా తుమ్ములు రావడం చాలా సందర్భాల్లో సాధారణ అలెర్జీ లేదా పర్యావరణ ప్రభావం మాత్రమే. అది తప్పనిసరిగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతం కాదు. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తోడైతే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.