Anjeer Benefits: అంజీర్ పండ్లు.. వీటినే అత్తిపండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మనిషి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉన్న ఈ పండ్లు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు.. ముఖ్యంగా ఈ పండ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అత్తిపండ్లలో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ఈ అంజీర్ పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బసం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పండల్లో కేలరీలు తక్కువగా ఉండి.. శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయి. అలా మనిషి బరువును నియంత్రించడంలోనూ సహాయపడుతాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. కరోనా సమయంలో అత్తిపండ్లను తినడం చాలా ఉత్తమం అని వైద్యులు కూడా చెబుతున్నారు. కారణం.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో అత్తిపండ్లు చాలా సహాయపడుతాయట. ఇందులో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, సల్ఫర్ వంటివి రోగనిరోధకిని పెంచుతాయి. అంతేకాదు. శరీర అలసట, బలహీనతను దూరం చేస్తుంది.
అత్తిపండ్లను తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. కండరాలు బలంగా మారుతాయి. డయాబెటిక్ రోగులు ఇవి తినడం చాలా మంచిదంటున్నారు వైద్యులు. మధుమేహాన్ని నియంత్రిస్తుందట. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. మహిళల్లో రుతుక్రమం సరిగ్గా జరిగేలా, పురుషుల్లో వీర్యాభివృద్ధి జరిగేలా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Also read:
Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..