మానవ శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన భాగం. శరీరంలోని అతిపెద్ద గ్రంథి అయిన లివర్ ఎన్నో పనులను నిర్వహిస్తుంది. కాలేయం జీర్ణవ్యవస్థ నుంచి రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు సరఫరా చేసే ముందు ఆహారాన్ని ఫిల్టర్ చేస్తుంది. దీంతోపాటు విటమిన్ ఎను సంశ్లేషణ చేయడంతోపాటు గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ రూపంలో నిల్వ చేస్తుంది. ముఖ్యమైన విధులను నిర్వహించే కాలేయం దెబ్బతింటే శరీరం ప్రమాదంలో పడుతుంది. ఏదైనా కారణం వల్ల కాలేయంలో ఆటంకం ఎదురై.. యాసిడ్ ఏర్పడటం ప్రారంభమైతే అప్పుడు ఛాతీలో మంట, వేడి, ఉదరం సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో కూర్చోవడం, పడుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది.
కాలేయంలో మంట ఎందుకు వస్తుంది..
కాలేయంలో మంట కలగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది మీ ఆహారం సరిగ్గా లేకపోవటం.. రెండవది మీరు నిద్రపోయే, మేల్కొనే సమయం స్థిరంగా లేకపోవటం. ఈ రెండు సమస్యలలో ఏదైనా ఒకటి దీర్ఘకాలం పాటు కొనసాగితే, కాలేయం బలహీనపడటం మొదలవుతుంది. బలహీనమైన కాలేయం జిడ్డుగల పదార్థాలను లేదా శుద్ధి చేసిన పిండి, మసాలా ఆహారాలను సులభంగా జీర్ణం చేసుకోదు. అందుకే మంట సమస్య మొదలవుతుంది.
కాలేయం ఇబ్బందుల్లో పడితే కనిపించే లక్షణాలు..
కాలేయం మంట సమస్యను ఎలా తగ్గించాలి
కాలేయం మంటను శాంతపరచడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం బర్నింగ్ సెన్సేషన్ నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ముందు దానిని గుర్తించగలగాలి. ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. కాలేయంలో మంట సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.
తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..
దీర్ఘకాలిక పరిష్కారం
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి