Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీరేట్లలో స్వల్ప తగ్గుదల‌

, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీరేట్లలో స్వల్ప తగ్గుదల‌

ప్రైవేట్ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. రెండు, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణ రేటు 8.85 శాతానికి, 9 శాతానికి తగ్గాయి. అంతకుముందు వడ్డీరేట్లు 8.90 శాతంగాను, 9.05 శాతంగా ఉన్నాయి. సవరించిన రేట్లు గురువారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. కానీ, మిగతా రుణాల వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఒకరోజు, నెల, మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేట్లు వరుసగా 8.35 శాతం, 8.40 శాతం, 8.45 శాతం, 8.55శాతం, 8.75 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాలు చెల్లించేవారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరనున్నది.