వయసు మీద పడినా.. పట్టుదల జార విడవలేదు

సుమారు 60 ఏళ్ళ పైబడిన చాలామంది వ్యక్తులే హాయిగా ఇంట్లో కృష్ణా రామా అంటూ జీవితాన్ని గడిపేస్తారు. అలాంటిది 99 ఏళ్ళ వయసు ఉన్న ఒక బామ్మ స్కూల్‌కి వెళ్లి చదువుకుంటోంది. అదేంటి 99 ఏళ్ళ బామ్మ స్కూల్‌కి వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా.? ఇది నిజమండీ. అర్జెంటీనాకు చెందిన ఆ బామ్మ హుషారుగా స్కూల్‌కి వెళ్లి చదువుకుంటోంది. ఇక అసలు ఆ బామ్మ ఎందుకు 99 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే […]

వయసు మీద పడినా.. పట్టుదల జార విడవలేదు
Follow us

|

Updated on: Apr 13, 2019 | 5:57 PM

సుమారు 60 ఏళ్ళ పైబడిన చాలామంది వ్యక్తులే హాయిగా ఇంట్లో కృష్ణా రామా అంటూ జీవితాన్ని గడిపేస్తారు. అలాంటిది 99 ఏళ్ళ వయసు ఉన్న ఒక బామ్మ స్కూల్‌కి వెళ్లి చదువుకుంటోంది. అదేంటి 99 ఏళ్ళ బామ్మ స్కూల్‌కి వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా.? ఇది నిజమండీ. అర్జెంటీనాకు చెందిన ఆ బామ్మ హుషారుగా స్కూల్‌కి వెళ్లి చదువుకుంటోంది. ఇక అసలు ఆ బామ్మ ఎందుకు 99 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే అర్జెంటీనాకు చెందిన ఆ బామ్మ పేరు యుసెబియా లియోనర్ కోర్డల్. ఆమెకు చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. పైగా అప్పుడు ఇంట్లో చాలా సమస్యలు ఉండడం.. దానితో పాటు ఫైనాన్సియల్ గా వెనుకబడటంతో తన చదువుకు కోర్డల్ బామ్మ ఫుల్ స్టాప్ పెట్టిందట. ఇక ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయని.. అందుకే మళ్ళీ స్కూల్‌కు వెళ్తున్నానని కోర్డల్ బామ్మ సెలవిచ్చింది.

బామ్మ ప్రస్తుతం లఫ్రిడాలో ఉన్న ప్రైమరీ స్కూల్‌కు వెళ్తోంది. ఇక ఆ స్కూల్ కూడా ఇలాంటి చిన్నప్పుడు చదువుకోలేకపోయినవాళ్లు పెద్దయ్యాక చదువుకోవడం కోసం ఏర్పాటు చేసినదే. తనకు 98 ఏళ్లు వచ్చినప్పటి నుంచే స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించిందట కోర్డల్ బామ్మ. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా స్కూల్‌కు డుమ్మా కొట్టలేదట. ఇక ఆమెను రోజూ స్కూల్‌లో పనిచేసే టీచర్లే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి… మళ్లీ సాయంత్రం ఇంటి దగ్గర వదిలిపెడతారట. చదువు మీద ఆసక్తి.. నేర్చుకోవాలనే తపన ఉన్న ఈ సూపర్ బామ్మకు హేట్సాఫ్.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్