హీరో గోపిచంద్‌కు యాక్సిడెంట్

టాలీవుడ్ హీరో గోపిచంద్ యాక్సిడెంట్‌కు గురయ్యారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో తన తాజా చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గోపిచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లింది చిత్రయూనిట్. అక్కడ ప్రథమ చికిత్స తీసుకున్న గోపిచంద్.. తిరిగి మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా తిరు దర్శకత్వంలో గోపిచంద్ ఓ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మి్స్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇంకా టైటిల్, […]

హీరో గోపిచంద్‌కు యాక్సిడెంట్
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2019 | 2:03 PM

టాలీవుడ్ హీరో గోపిచంద్ యాక్సిడెంట్‌కు గురయ్యారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో తన తాజా చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గోపిచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లింది చిత్రయూనిట్. అక్కడ ప్రథమ చికిత్స తీసుకున్న గోపిచంద్.. తిరిగి మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా తిరు దర్శకత్వంలో గోపిచంద్ ఓ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మి్స్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇంకా టైటిల్, హీరోయిన్ ఖరారు అవ్వలేదు. లౌక్యం తరువాత వరుస పరాజయాలతో ఢీలా పడ్డ గోపిచంద్.. ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.

Latest Articles