Breaking: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్స్!

కరోనా ఎఫెక్టు తగలని రంగం అంటూ కనిపించని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు కరోనా వైరస్ ప్రభావం తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను తక్షణం నిలిపివేయాలని..

Breaking: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్స్!
Follow us

|

Updated on: Mar 12, 2020 | 1:18 PM

TRS MLA Kishanreddy asked govt to stop drunk & drive tests: కరోనా ఎఫెక్టు తగలని రంగం అంటూ కనిపించని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు కరోనా వైరస్ ప్రభావం తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను తక్షణం నిలిపివేయాలని, కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తొలిగిన తర్వాతనే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. సొంత ఎమ్మెల్యే చేసిన విఙ్ఞప్తిని పరిశీలిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టస్టులను జోరుగా నిర్వహిస్తున్నారు పోలీసులు. తాగి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలకు కారణం కావద్దన్నది పోలీసుల ఉద్దేశం. కానీ.. మందుబాబులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న బ్రీత్ ఎనలైజర్లు మాత్రం పోలీసుల దగ్గర తగిన సంఖ్యలో లేవు. దాంతో ఒకే బ్రీత్ ఎనలైజర్ను ముగ్గురు, నలుగురికి పోలీసులు వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ భయాందోళన ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతోంది. బహిరంగ ప్రదేశాలలో మాస్కులతో కనిపించే జనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపివేయాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. అయితే.. వారం, పది రోజుల క్రితం ఈ డిమాండ్ వినిపించగా.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలివేసేది లేదని ఖరాఖండీగా చెప్పారు. తాజాగా ఈ అంశం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను తాత్కాలికంగా నిలిపి వేయాలని గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ప్రభుత్వాన్ని కోరారు. ‘‘రాష్ట్రంలో కరోనా ఫీవర్ నడుస్తుంది.. కరోనా ఫీవర్ పోయేవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేయాలి.. బ్రీథింగ్ టెస్టుల్లో ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి.. కొన్ని రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపి వేయాలి’’ ఇదీ కిషన్ రెడ్డి ప్రభుత్వం ముందుంచిన విఙ్ఞప్తి. ఎమ్మెల్యే చేసిన విఙ్ఞప్తిని పరిశీలిస్తామని హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. సో.. ప్రభుత్వం సానుకూలంగా వుంటే కొన్నిరోజులపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఆగిపోయే ఛాన్స్ వుంది.

Read this: రేవంత్ రెడ్డి అవకాశాలకు కోమటిరెడ్డి గండి Komatireddy indirect punch to Revanthreddy

Latest Articles