బడ్జెట్ ఎఫెక్ట్.. బంగారానికి రెక్కలు

Gold to cost more as govt proposes hike in customs duty, బడ్జెట్ ఎఫెక్ట్.. బంగారానికి రెక్కలు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విదేశీ దిగుమతులపై సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో బంగారం రేటుకి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గోల్డ్‌పై కూడా పన్ను విధిస్తున్నట్లు తెలపడంతో.. రూ. 590లు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 34 వేలకు పైగా ఉంది. ఇండియన్ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ రూ. 34,800 కు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రూ.35,930 గా ఉంది. వెండి మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 38,500 గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 40,580 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *