మస్కట్ నుంచి బంగారం అక్రమ రవాణా

విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా, అక్రమంగా పసిడిని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త దారుల్ని వెతుకుతున్నారు. బంగారాన్ని పొడి చేసి.. రసాయన మిశ్రమాలతో చేసిన పేస్టుల్లో కలిపి తరలిస్తున్నారు. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు పేస్టులో బంగారాన్ని కలిపి అక్రమంగా తీసుకువచ్చిన ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులకు చిక్కారు. వారి వద్ద 2.14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ.72లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌కు […]

మస్కట్ నుంచి బంగారం అక్రమ రవాణా
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 9:15 PM

విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా, అక్రమంగా పసిడిని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త దారుల్ని వెతుకుతున్నారు. బంగారాన్ని పొడి చేసి.. రసాయన మిశ్రమాలతో చేసిన పేస్టుల్లో కలిపి తరలిస్తున్నారు.

మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు పేస్టులో బంగారాన్ని కలిపి అక్రమంగా తీసుకువచ్చిన ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులకు చిక్కారు. వారి వద్ద 2.14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ.72లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో ఒక ప్రయాణికుడు గురువారం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. 1850 గ్రాముల బరువున్న పేస్ట్‌ కవర్‌ను ఒక నల్లటి వస్త్రంలో పెట్టుకుని నడుము చుట్టూ కట్టుకొని వచ్చాడు. అధికారులు తనిఖీ చేస్తుండగా అతడు పట్టుబడ్డాడు. ఆ పేస్టును స్వాధీనం చేసుకొని కాల్చగా అందులోంచి రూ.46.25 లక్షల విలువైన 1398 గ్రాముల బంగారం లభ్యమైంది.

మరో ఘటనలోనూ బుధవారం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఒక ప్రయాణికుడు పేస్ట్‌ ఉన్న కవర్‌ను అండర్‌వేర్‌లో పెట్టుకొని వచ్చాడు. 900 గ్రాముల బరువున్న ఆ పేస్ట్‌ను కాల్చగా రూ.24.54 లక్షల విలువైన 738 గ్రాముల బంగారం బయటపడింది. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.