ఆ బోటుకు ఈ ఏడాది వరకు వ్యాలిడిటీ ఉంది: తూ.గో.జిల్లా కలెక్టర్

దేవీపట్నం మండలం కచ్చలూరువద్ద ఆదివారం మునిగిపోయిన బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 8 మృతదేహాలు వెలికితీసినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పొద్దు పోయే వరకు సహాయక దళాలు గాలిస్తూనే ఉన్నారని, తిరిగి ఇవాళ ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారని కలెక్టర్ వివరించారు. ప్రమదంలో మృతిచెందిన వారికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ కొనసాగుతుందని, ఇది పూర్తయిన తర్వాత మృత దేహాలను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ప్రమాదానికి సంబంధించి టోల్ ఫ్రీ […]

ఆ బోటుకు ఈ ఏడాది వరకు వ్యాలిడిటీ ఉంది: తూ.గో.జిల్లా కలెక్టర్
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 9:47 AM

దేవీపట్నం మండలం కచ్చలూరువద్ద ఆదివారం మునిగిపోయిన బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 8 మృతదేహాలు వెలికితీసినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పొద్దు పోయే వరకు సహాయక దళాలు గాలిస్తూనే ఉన్నారని, తిరిగి ఇవాళ ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారని కలెక్టర్ వివరించారు. ప్రమదంలో మృతిచెందిన వారికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ కొనసాగుతుందని, ఇది పూర్తయిన తర్వాత మృత దేహాలను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ప్రమాదానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామని, బాధిత కుటుంబ సబ్యులు ఎవరైనా తమ కుటుంబం సభ్యుల వివరాలు తెలుసుకునే వీలు కల్పించామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలియజేశారు. ఇదిలాఉంటే ప్రమాదానికి కారణమైన వశిష్ఠ బోటుకు పోర్టు అధికారి 2018లో అనుమతి మంజూరు చేయగా దానికి 2019 వరకు వ్యాలిడిటీ ఉందని ఆయన చెప్పారు.  కచ్చలూరు వద్ద మునిగిపోయిన వశిష్ఠ బోటు దాదాపు 300 అడుగుల లోతులో దిగబడిపోయినందున దాన్ని నేవీకి చెందిన డీప్ డ్రైవర్స్ ద్వారా బయటకు తీసే ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.

Latest Articles