Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

రంగంలోకి మరో టీమ్.. కచ్చులూరు కథ ఇంకెన్నాళ్లు..?

రెండవ సారి ఆపరేషన్ చేపట్టిన తర్వాత రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు ఐదవ రోజు కూడా కొనసాగుతున్నాయి. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసేదెవరు..? బోటుకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చే మొనగాడెవరు..? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోటు వెలికితీత పనులు మూడు అడుగులు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. సుమారు 34 రోజుల నుంచి ఈ డ్రామా సాగుతూ వస్తోంది. అసలు ఇప్పటికైనా బోటును వెలికితీస్తారా..? అని బాధితుల కుటుంబాలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. ఇక బోటును బయటకు తీసే ప్రయత్నంలో ధర్మాడి సత్యం టీం పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ అధికారులు వేరే టీం కోసం గాలిస్తున్నట్లు సమాచారం. తాజాగా కాకినాడ నుంచి ఓ టీం రానుందని.. బోటును ఎలాగైనా వెలికితీస్తుందని కొందరు చెబుతున్నారు. మరోవైపు తామే బోటును ఎలాగైనా బయటకు తీస్తామని ధర్మాడి టీం సవాల్ చేస్తోంది.

ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నంలో బోటుకు లంగర్ తగిలినా.. ఊడొచ్చిన రౌలింగ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు మళ్లీ లంగర్ తగిలితే తప్ప బోటు బయటికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే ధర్మాడి సత్యం టీం దుబాసీల కోసం విశాఖకు వెళుతున్నట్లు సమాచారం. దుబాసీలు నీటిలో దిగి రోప్‌ను కడితేనే తప్ప బోటు బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే రోప్‌ను కట్టేందుకు దుబాసీలు నో చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాల వల్ల 300 అడుగుల లోతులో ఉన్న బోటు.. 250 అడుగుల వరకు పైకి వచ్చిందని.. ప్రస్తుతం ఒడ్డుకు 50 అడుగుల లోతులో ఉందని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. మరోవైపు బోటు మునిగి ఉన్న ప్రాంతం అంతా దుర్వాసనతో నిండిపోయింది. సెప్టెంబర్ 15న గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునగడంతో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఎంతోమంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 13 కుటుంబాలు గల్లంతైన తమ వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు సత్యం టీమ్ ఆపరేషన్ సక్సస్ కాదన్న సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆపరేషన్ వశిష్ట కథ ముగిసినట్లేనా..? ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నం బూడిద పాలేనా..? అన్న సందేహాలు అందరిలో మెదులుతున్నాయి.