జుట్టు పెరుగుతుందని హాస్పిటల్‌కి వెళ్తే.. శవమైంది..!

Girl dies after getting medicines for hair growth in Kurnool

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటుచేసుకుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతుందని.. భయంతో.. కర్నూలులోని ఓ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లింది మౌనిక (19) అనే అమ్మాయి. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మ కూతురు మౌనిక ఇంటర్ చదువుతోంది. జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుండటంతో.. కర్నూలులోని డాక్టర్ శరత్ చంద్ర వద్ద రెండు నెలల క్రితం వెళ్లింది. ఆయన రాసిచ్చిన మందులు వాడుతూ ఉంది. ఈ క్రమంలో ఆమెకు సడన్‌గా ఒంటిపై బొబ్బలు వచ్చాయి. డౌట్ వచ్చి మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లగా.. హాస్పిటల్‌ సిబ్బంది బొబ్బలు తగ్గుతాయని, వేచి చూడాలని నిర్లక్ష్యంగా సమాచారమిచ్చారు. మూడు రోజుల తర్వాత.. మౌనిక ఆరోగ్యం మరింత విషమించి మరణించింది. దీంతో.. ఆగ్రహించిన మౌనిక కుటుంబసభ్యులు.. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.. ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *