బండి సంజయ్‌పై సీపీ సజ్జనార్ సీరియస్.. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలంటూ చురకలు..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొందరు పోలీసు అధికారులే ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులపై బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సంజయ్‌కు సీపీ చురకలంటించారు. సంజయ్‌పై లీగల్ ఒపీనియన్‌కు వెళ్తున్నామని, కేసులను పక్కాగా […]

బండి సంజయ్‌పై సీపీ సజ్జనార్ సీరియస్.. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలంటూ చురకలు..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 6:10 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొందరు పోలీసు అధికారులే ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులపై బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సంజయ్‌కు సీపీ చురకలంటించారు. సంజయ్‌పై లీగల్ ఒపీనియన్‌కు వెళ్తున్నామని, కేసులను పక్కాగా నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ.. నేరుగా నేతలు ఇంకో పార్టీ స్థావరాలపై దాడులకు దిగడం సరికాదని సీపీ చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్, పోలీసు అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ టీఆర్ఎస్ గెలిచేందుకు సలహాలు ఇస్తోందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. డబ్బులు పంచుతున్న నాయకులపై కేసులు పెట్టకపోగా.. కొన్ని చోట్ల పోలీసు అధికారులే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బండి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేసేందుకూ తాము వెనుకాడబోమని సంజయ్ స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తే డీజీపీ, ఈసీలే బాధ్యత వహించాలన్నారు.

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక