GHMC Elections 2016 Results:నాటి ఫలితాలను టీఆర్ఎస్ బ్రేక్ చేస్తుందా? 2016 ఫలితాలేంటి? తాజా పరిస్థితేంటి?

GHMC Elections 2016 Results: తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. 2016లో నమోదైన ఫలితాలను ప్రతిబింబిస్తాయా? నాటి రికార్డ్‌ను అధికార టీఆర్ఎస్...

GHMC Elections 2016 Results:నాటి ఫలితాలను టీఆర్ఎస్ బ్రేక్ చేస్తుందా? 2016 ఫలితాలేంటి? తాజా పరిస్థితేంటి?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2020 | 3:50 PM

GHMC Elections 2016 Results: తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. 2016లో నమోదైన ఫలితాలను ప్రతిబింబిస్తాయా? నాటి రికార్డ్‌ను అధికార టీఆర్ఎస్ పార్టీ తిరగరాస్తుందా? లేక టీఆర్ఎస్‌ను బీట్ చేసి బీజేపీ నిలుస్తుందా? అనేది సస్పెన్షన్‌గా ఉంది. ప్రస్తుతం కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉన్నా.. సాధారణ ఓట్ల లెక్కింపులో మాత్రం టీఆర్ఎస్ పార్టీనే దూసుకుపోతుంది. ఇలాంటి తరుణంలో ఒకసారి 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకుందాం.

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొడుతుందని భావించినా దాదాపు ఆ సంఖ్యను రీచ్ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 వార్డులుండగా టీఆర్ఎస్ పార్టీ 99 వార్డుల్లో ఘన విజయం సాధించి జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను రెపరెపలాడించింది. ఇక నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఏఐఎంఐఎం 44 వార్డుల్లో గెలుపొందింది. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 2 వార్డుల్లో, బీజేపీ 4, టీడీపీ 1 వార్డు చొప్పున కైవసం చేసుకున్నారు. ఇక నాటి ఎన్నికల్లో 45. 29 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా, నాటి ఎన్నికల సమయంలోనూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై ప్రచార పర్వాన్ని సాగించారు. తనదైశైలితో గ్రేటర్ వాసులను ఆకట్టుకున్నారు. ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. కేటీఆర్ మాటలను నమ్మిన ప్రజలు నాడు టీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా కేటీఆరే అన్నీ తానై వ్యవహరించారు. ఇదే సమయంలో బల్దియాపై బీజేపీ జెండాలని ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆ పార్టీ.. అందకు తగ్గట్లుగానే ఎన్నికల పోరు సాగించింది. ఏకంగా కేంద్ర పెద్దలనే రంగంలోకి దించి గ్రేటర్ పోరును మరో లెవల్‌కు తీసుకువెళ్లియింది. అయితే కేంద్ర పెద్దలు వచ్చినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏమాత్రం తగ్గలేదు. తానొక్కడే అందరికీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. గడిచిన కాలంలో ప్రజలకు తాము ఏం చేశామో, మళ్లీ గెలిసిస్తే ఏం చేస్తామో ప్రజలకు సవివరంగా తెలుపుతూ ఓటర్లను టీఆర్ఎస్ వైపు ఆకర్షిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లోని 6 జోన్లు, 30 సర్కిళ్లలో ఉన్న 150 వార్డులకు 2020 డిసెంబర్ 1న ఎన్నికలు జరిగాయి. 150 కార్పొరేటర్ పోస్టులకు 1122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో పురుషులు 582, మహిళలు 540. పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు వయస్సు 41 ఏళ్లు. ఈ ఎన్నికలు కొత్త జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎవరు ఉండాలో కూడా నిర్ణయిస్తాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 38.5 లక్షల మంది పురుషులు, 35.5 లక్షల మంది మహిళలు ఉన్నారు. 669 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి..

Also Read:

GHMC Election Result 2020 Live Update : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బోణీ కొట్టిన ఎంఐఎం, మెహదీపట్నంలో గెలుపు

GHMC Elections Results 2020: కూకట్‌పల్లిలో ఓట్లు గల్లంతు..కౌంటింగ్ సిబ్బందితో బీజేపీ ఏజెంట్ల వాగ్వాదం..ఉద్రిక్తత

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..