బాంబు పేలుడులో నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా.. వరుస పేలుళ్లు లేవని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్లీ నిత్యం ఎక్కడో ఓ చోట.. కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి.

బాంబు పేలుడులో నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 1:41 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా.. వరుస పేలుళ్లు లేవని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్లీ నిత్యం ఎక్కడో ఓ చోట.. కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల తాలిబన్లు దాడులు జరుపుతుండగా.. మరికొన్ని చోట్లు లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు దాడులకు దిగుతున్నారు. ఇదిలావుంటే.. మరికొన్ని చోట్ల జరుగుతున్న బాంబు పేలుళ్లు ఎవరు చేస్తున్నారన్న దానిపై క్లారిటీ రావడం లేదు. తాజాగా బుధవారం రాత్రి నార్తర్న్ ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది. బల్క్ ప్రావిన్స్‌లోని వజిరాబాద్ గ్రామంలో ఇళ్లమధ్యలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఉజ్జెకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉండటంతో.. ఈ దాడికి కారణాలు తెలియడం లేదు. ఇక్కడ నిత్యం తాలిబన్ల అలజడి ఉండటంతో.. వారే ఈ పేలుడుకు కారణమై ఉంటారని.. పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి దాడులు చేసినప్పుడు తాలిబన్లు తామేనంటూ ప్రకటించుకునేది. అయితే ఇప్పటి వరకు ఈ పేలుడుకు సంబంధించి తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Latest Articles