ఇక మేమూ మిలిటరీ పోలీసులమే: ఆర్మీలో విమెన్

భారత ఆర్మీలో మొట్టమొదటిసారిగా మహిళలు కూడా జవాన్లతో సమానంగా విధులు నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా మిలిటరీ పోలీస్ పేరిట ఏర్పాటు చేసిన విభాగంలో మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి ఆర్మీ యాడ్‌ను వార్తాపత్రికల్లో ఇవ్వడం విశేషం. సాయధ దళాల్లో అధికారి హోదాకు తక్కువ స్థాయిలో మహిళలను నియమిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల తరువాత సైనికాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ సోల్జర్ జనరల్ డ్యూటీ నియామకానికి సంబంధించి దరఖాస్తులను గురువారం నుంచి జారీ చేస్తుండగా.. ఇది జూన్ 8తో […]

ఇక మేమూ మిలిటరీ పోలీసులమే: ఆర్మీలో విమెన్
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 12:58 PM

భారత ఆర్మీలో మొట్టమొదటిసారిగా మహిళలు కూడా జవాన్లతో సమానంగా విధులు నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా మిలిటరీ పోలీస్ పేరిట ఏర్పాటు చేసిన విభాగంలో మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి ఆర్మీ యాడ్‌ను వార్తాపత్రికల్లో ఇవ్వడం విశేషం. సాయధ దళాల్లో అధికారి హోదాకు తక్కువ స్థాయిలో మహిళలను నియమిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల తరువాత సైనికాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ సోల్జర్ జనరల్ డ్యూటీ నియామకానికి సంబంధించి దరఖాస్తులను గురువారం నుంచి జారీ చేస్తుండగా.. ఇది జూన్ 8తో ముగిస్తుందని’’ ఆ యాడ్‌లో పేర్కొన్నారు.

ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ ట్వీట్ చేసింది. మహిళలకు సాధికారికత విషయంలో మరో ముందడుగు వేశామని ప్రకటించుకుంది. రెగ్యులర్ ఆర్మీలో అటాచ్ అయిన వ్యక్తులు క్రమశిక్షణను ఉల్లంఘించిన పక్షంలో వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ స్థాయి మహిళా ఉద్యోగులకు ఉంటుందని ఆర్మీ వెబ్‌‌సైట్ స్పష్టం చేసింది. అలాగే సైన్యంలో రేప్, దొంగతనం వంటి నేరాలకు పాల్పడేవారిపై కూడా చర్యలు తీసుకునే అధికారాలు కూడా వీరికి ఉంటాయట. కాగా సాయుధ దళాల్లో మహిళల నియమకానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గతంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.