డ్రైనేజ్‌లో 5 కేజీల ఆభరణాలు..అంతలోనే షాక్..!

లక్ కలిసిందనుకున్నారు. ఈ రోజు నుంచి తాము శ్రీమంతులమని  ఫీల్ అయ్యారు. లక్ష్మీదేవి తమను కనికరించిదని మురిసిపోయారు. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఎటైనా వెళ్లిపోయి బ్రతకాలనుకున్నారు.. ఇద్దరు పారిశుద్ద కార్మికులు. కట్ చోస్తే..మూడు రోజులకి అదే డ్రైనేజ్ వర్క్ చేసుకుంటున్నారు. అసలు స్టోరీ ఏంటి అంటారా..? అయితే చదవండి.. చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్‌ చౌక్‌ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి […]

డ్రైనేజ్‌లో 5 కేజీల ఆభరణాలు..అంతలోనే షాక్..!
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2019 | 8:31 AM

లక్ కలిసిందనుకున్నారు. ఈ రోజు నుంచి తాము శ్రీమంతులమని  ఫీల్ అయ్యారు. లక్ష్మీదేవి తమను కనికరించిదని మురిసిపోయారు. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఎటైనా వెళ్లిపోయి బ్రతకాలనుకున్నారు.. ఇద్దరు పారిశుద్ద కార్మికులు. కట్ చోస్తే..మూడు రోజులకి అదే డ్రైనేజ్ వర్క్ చేసుకుంటున్నారు. అసలు స్టోరీ ఏంటి అంటారా..? అయితే చదవండి..

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్‌ చౌక్‌ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారి చేతికర్రకు లోపల నుంచి ఓ రాయి అడ్డు తగినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా  కర్రతో తీయడం సాధ్యపడలేదు. దీంతో కాలువలోకి దిగి దాన్ని చేత్తో బయటకు తీసి చూస్తే అది రాయి కాదు.. ఓ సంచి. ఇద్దరు కార్మికులు కాస్త పక్కకు వెళ్లి సంచిని తెరచి చూడగా సంచిలో దాదాపు 5 కిలోలకు పైగా ఆభరణాలున్నాయి. ఇద్దరూ ఒకరు మోహం ఒకరు చూసుకోని చూసకోని..వెంటనే అలర్ట్ అయి ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి.. వాటిని ఇద్దరూ సమంగా పంచుకున్నారు. మరుసటి రోజు నుంచి ఏం తెలియనట్టు తమ విథులకు హాజరయ్యారు.

ఇంట్లో దాచిన ఆభరణాలను రోజూ చూస్తూ మురిసిపోయారు. కానీ సోమవారం  పోలీసులు వెళ్లి ఆ కార్మికుల ఇళ్ల తలుపులు కొట్టారు. మీకు కాలువలో దొరికన ఆభరణాలు ఎక్కడ అని ప్రశ్నించారు. మాకా..? ఆభరణాలు దొరికాయా..? అలాంటిదేమీలేదే..అంటూ ఊహించే సమాధాన్నే ఇచ్చారు. ఖాకీలు సీసీ కెమెరా వీడియో చూపించడంతో చేసేదేమీలేక ఒప్పుకున్నారు.

‘అయ్యా.. దొరికిన దాంట్లో కొంతైనా మాకు ఇస్తే ఉన్న కష్టాలు తీరిపోతాయి.!’ అని వేడుకున్నారు. కానీ అక్కడే వారికి పోలీసులు అదిరిపోయే ట్విస్టు ఇచ్చారు. అవి బంగారం కాదు గిల్టు నగలు అని చెప్పడంతో బేల మొహాలు వెయ్యడం ఇద్దరి వంతయ్యింది. చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం ఆంధ్రాబ్యాంకులో పది రోజుల క్రితం చోరీకి గురైన ఆభరణాల్లో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అప్రైజర్‌ రమేష్‌ గిల్టు నగలను బ్యాంకులో ఉంచి రుణం పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిని తమదైన శైలిలో విచారిస్తే వీటిని పడేసిన కాలువను చూపించాడు. సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల వద్ద ఉన్న గిల్టు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.