తలనొప్పి తగ్గడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు ఇవే!

Five Best Home Remedies To Cure Head Aches, తలనొప్పి తగ్గడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు ఇవే!

ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన, ఆర్ధిక సమస్యలు.. ఇలా పలు కారణాల వల్ల తరుచూ మనకు తలనొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో మనం ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగానూ, చిరాకుగానూ ఉంటుంది. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువైతే.. అప్పుడు వచ్చే బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అయితే ఈ తలనొప్పిని మన ఇంట్లో వాడే సహజసిద్ధమైన పధార్ధాలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  • బాగా తలనొప్పి కలిగినప్పుడు.. జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులు తింటే కొంచెం నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అవి పెయిన్ కిల్లర్స్ మాదిరి బాగా పని చేస్తాయి.
  • తలనొప్పి ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలిని కొంతసేపు పీల్చుకుని.. ఒంటరిగా కాసేపు వాకింగ్ చేయడం మంచిది
  • ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగినా తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు
  • ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగినా కూడా తలనొప్పి నుంచి కాస్తా రిలీఫ్ లభిస్తుంది
  • మన శరీరంలో కొన్నిసార్లు నీరు శాతం తక్కువైనా.. తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే నీటిని బాగా తాగితే తలనొప్పి తగ్గే అవకాశాలు ఉంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *