తొలి రోజు అమ్మకాలు నై… రెండో రోజు రూ. 250.. హైదరాబాద్‌లో పటాకుల వ్యాపారం

తెలంగాణలో పటాకుల వ్యాపారులు గట్టెక్కారు. ఈ దీపావళికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.250 కోట్ల మేర బాణసంచా వ్యాపారం జరిగింది. లాభాల విషయాన్ని పక్కన పెడితే....

తొలి రోజు అమ్మకాలు నై... రెండో రోజు రూ. 250.. హైదరాబాద్‌లో పటాకుల వ్యాపారం
Follow us

|

Updated on: Nov 16, 2020 | 3:17 PM

Diwali Crackers Business : తెలంగాణలో పటాకుల వ్యాపారులు గట్టెక్కారు. ఈ దీపావళికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.250 కోట్ల మేర బాణసంచా వ్యాపారం జరిగింది. లాభాల విషయాన్ని పక్కన పెడితే.. వ్యాపారులు నిండా నష్టాల్లో మునిగిపోకుండా.. కొంత ఊరట పొందారు.

టోకు వ్యాపారులకు లాభాలు వచ్చినా.. రిటైల్‌ వ్యాపారులు నష్టాలను ముటగట్టుకున్నారు. బాణసంచాపై హైకోర్టు నిషేధం విధించడం.. ఆ తర్వాత క్రాకర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అక్కడ ఎన్జీటీ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.

తొలుత అన్‌లాక్‌లతో వ్యాపారానికి ఢోకా లేదనుకున్న వ్యాపారులు అకస్మాత్తుగా హైకోర్టు బాణసంచా క్రయవిక్రయాలను నిషేధించడంతో చతికిలపడిపోయారు. ఓ దశలో బంజారాహిల్స్‌ సాగర్‌సొసైటీ మైదానంలో ఏర్పాటు చేసిన ఫైర్‌క్రాకర్స్‌ స్టాల్స్‌ వద్ద క్రాకర్స్‌ అసోసియేషన్‌ ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. చివరి 2 రోజుల విక్రయాలతో గట్టెక్కామని అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

అయితే హైదరాబాద్ నగరంలో ఈ సారి బాణసంచా దుకాణాలు తగ్గిపోయాయి. గ్రీన్‌ క్రాకర్స్‌ నే కాల్చాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆదేశించిన నేపథ్యంలో.. ఆ తరహా టపాసులను విక్రయించే బ్రాండెడ్‌ కంపెనీలు, వ్యాపారులు మాత్రమే ఈ సారి మార్కెట్‌లో కనిపించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సారి దుకాణాల సంఖ్య 50 శాతం పడిపోయాయి. విక్రయాలు కూడా ప్రతి సంవత్సరంతో పోలిస్తే.. 60-70ు మాత్రమే జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పుతో అయోమయానికి గురైన వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రాలేదని, సుప్రీంకోర్టు ఆదేశాలు వారిదాకా చెరడంలో ఆలస్యం జరిగిందని.