చైనా కంపెనీలకు భారత్ మరో షాక్

సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం చైనా-భారత్ ల మధ్య దూరం మరింత పెరుగుతోంది. చైనా కంపెనీలకు భారతదేశం నుంచి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించిన కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు సంబంధించి కాంట్రాక్టులను కూడా వదిలించుకోవాలని నిర్ణయించింది.

చైనా కంపెనీలకు భారత్ మరో షాక్
Follow us

|

Updated on: Jul 24, 2020 | 7:19 PM

సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం చైనా-భారత్ ల మధ్య దూరం మరింత పెరుగుతోంది. చైనా కంపెనీలకు భారతదేశం నుంచి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించిన కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు సంబంధించి కాంట్రాక్టులను కూడా వదిలించుకోవాలని నిర్ణయించింది. అంతే కాకుండా మరిన్ని చైనా యాప్స్ బ్యాన్ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరోవైపు భారతదేశంలో రహదారుల నిర్మాణానికి చైనా కాంట్రాక్టులు ఉండబోవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన అనంతరం భారత్ చకచకా చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. అటు అంతర్జాతీయంగా చైనాను దోషిగా నిలబెట్టిన భారత్ ఆ దేశంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరపకుండా ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ పెరిగింది. చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్‌ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయి. చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించడం ప్రపంచదేశాలు సైతం అదే దారని అనుసరిస్తున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే దిశలో ఆలోచనలు జరపడం చైనా కంపెనీల్లో గుబులు పెంచింది. దీంతో చైనాతో తెగదెంపులు చేసుకోవాలని టిక్‌టాక్, హెలో పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ ఫ్లాన్ చేసింది.

అయితే, భారతదేశం నిషేధం విధించిన తర్వాత కూడా చైనా కంపెనీలు లైట్ వర్షన్ యాప్స్ నిర్వహిస్తుండడాన్ని భారత ప్రభుత్వం పసిగట్టింది. అందుకే వాటి లైట్ వర్షన్ యాప్స్‌ని యాప్ స్టోర్ల నుంచి తొలగించింది. అంతేకాదు… చైనా విషయంలో భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటి వరకు ప్రైవేటు రంగ సేకరణకు మాత్రమే వర్తింపజేసిన ఉత్తర్వులను ప్రభుత్వ రంగంలో అమలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం జనరల్ ఫై ఫైనాన్షియల్ రూల్స్ 2017” ను సవరించింది. కోవిడ్ -19 కొరకు వైద్య సామాగ్రిని 2020 డిసెంబర్ 31 వరకు సేకరించడం సహా కొన్నింటికి మాత్రమే పరిమితం చేసింది.

Latest Articles
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..