ఇవాళ రాజధాని సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ పరేడ్.. వేల సంఖ్యలో తరలుతున్న అన్నదాతలు.. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..

Tractor Parade: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవాళ రాజధాని సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ పరేడ్.. వేల సంఖ్యలో తరలుతున్న అన్నదాతలు.. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 5:05 AM

Tractor Parade: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజు భారీ స్థాయిలో ట్రాక్టర్ పరేడ్ నిర్వహించేందుకు రైతుం సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు కిసాన్‌ ట్రాక్టర్ పరేడ్‌ ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో, రైతులు ట్రాక్టర్‌ పరేడ్‌ తలపెట్టిన మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్‌ పరేడ్‌ ప్రారంభిస్తామని, సెంట్రల్‌ ఢిల్లీలోకి ప్రవేశించబోమని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ పరేడ్‌లో దాదాపు 2 లక్షల ట్రాక్టర్లు, రైతుల శకటాలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 11సార్లు రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అయినా చర్చలు ఫలించని సంగతి తెలిసిందే.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు.. కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్‌కు చెందిన కుటుంబం.. పెళ్లి వేడుకలో హుండీ ఏర్పాటు చేసి..