Breaking News
  • కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమబోధన జనసేన విధానం. 8వ తరగతి వరకు మాతృభాష బోధన కేంద్రం విధానం. వైసీపీ సర్కార్‌ కేంద్ర విధానానికి వ్యతిరేకంగా వెళ్తోంది ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి -పవన్‌ కల్యాణ్‌
  • లక్ష్మీపార్వతికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు. ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి నియామకం. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న లక్ష్మీపార్వతి
  • కర్నూలు: పాణ్యం విజయానికేతన్‌ స్కూల్‌లో దారుణం. సాంబార్‌ పాత్రలోపడి ఎల్‌కేజీ విద్యార్థికి తీవ్రగాయాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పురుషోత్తంరెడ్డి మృతి
  • కేబినెట్‌ అనంతరం మంత్రులతో సీఎం జగన్‌ భేటీ. ఔట్‌ సోర్సింగ్ కార్పొరేషన్‌పై చర్చ. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించొద్దన్న మంత్రులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే 50 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడడానికి వీల్లేదన్న సీఎం రాష్ట్రంలో రాజకీయ అవినీతి తగ్గినా అధికారుల స్థాయిలో అవినీతి తగ్గలేదన్న పలువురు మంత్రులు
  • అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
  • తూ.గో: గోదావరిలో ఇసుక పడవ మునక. ఇసుక తరలిస్తుండగా మునిగిన పడవ. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి దగ్గర ఘటన. సురక్షితంగా బయటపడ్డ ఇసుక కార్మికులు
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి. ఓ ఆయుధం, పేలుడు పదార్ధాలు స్వాధీనం సుకుమా జిల్లా గచ్చనపల్లి అటవీ ప్రాంతంలో ఘటన

విలాసాల ‘రాణి’ వీడియో అదుర్స్

ఈఎస్‌ఐ మందుల స్కామ్‌లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ మాజీ డైరక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి విలాసాలు బయటకు వస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఆమె విలాసవంతమైన జీవితం గడిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాజాగా ఆమె జల్సాలకు సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.

విచ్చలవిడిగా డబ్బు వచ్చిపడుతుంటే ఏం చేయాలో తోచకనే ఆమె జల్సాలు చేసేదని.. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లలో ఎంజాయ్ చేసేదని అధికారుల విచారణలో తేలింది. అంతేకాదు భారీ విల్లాను కొనుగోలు చేయడంతో పాటు.. పీఎంజీ వంటి అతిపెద్ద జువెలరీ షాపులో కోట్ల విలువైన నగలను దేవికారాణి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీలలో దేవికారాణి ప్రత్యేకంగా కనిపించేందుకు బ్యూటీషియన్లను పిలిపించుకుని అందంగా తయారయ్యేదట. ఇక డ్యాన్స్‌ మాస్టర్లను పెట్టుకుని డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదట. అంతేనా.. ఆత్మరక్షణ కోసం నాన్‌చాక్‌ తిప్పడం కూడా నేర్చుకోవడం విశేషం. ఇక దీనికి సంబంధించిన వీడియోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈఎస్‌ఐ స్కామ్‌లో తాజాగా ఏసీబీ తేజా ఫార్మా ఎండీ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది.