ఉపాసన షో… ‘‘యువర్ లైఫ్’’ వెబ్ పోర్టల్ లో ‘‘హై ఆన్ లైఫ్’’ కార్యక్రమం…. అతిథిగా పాల్గొన్న హీరో నవదీప్

కొణిదెల ఉపాసన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'యువర్ లైఫ్' వెబ్ పోర్టల్ లో 'డ్రగ్స్ అండ్ అడిక్షన్' అంశాన్ని చర్చించబోతున్నారు. ఈ అంశంపై  ఇటీవల జరిపిన చర్చలో ప్రముఖ నటుడు నవదీప్ అతిథిగా పాల్గొన్నారు.

ఉపాసన షో... ‘‘యువర్ లైఫ్’’ వెబ్ పోర్టల్ లో ‘‘హై ఆన్ లైఫ్’’ కార్యక్రమం.... అతిథిగా పాల్గొన్న హీరో నవదీప్

Updated on: Dec 19, 2020 | 9:25 PM

డ్రగ్స్ మీద ఆధారపడటం మనలో చాలా మందికి జీవితంతో విడదీయరాని విషయం అయ్యింది. నొప్పులు, నిద్ర లేమి, జలుబు, ఫ్లూ, దగ్గు ఇలాంటి అనారోగ్యాలకు దీర్ఘ కాలం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. డ్రగ్ లపై ఆధారపడటం శరీరానికి ఎంతో హాని చేస్తుంది. డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడినప్పుడే మనం ఈ ఆరోగ్య సమస్యలను సగం గెల్చినట్లు.

ఉపాసన షో…

యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ఈ విషయం మీద అవగాహన కల్పించేందుకు కొణిదెల ఉపాసన ముందుకొచ్చింది. ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యువర్ లైఫ్’ వెబ్ పోర్టల్ లో ‘డ్రగ్స్ అండ్ అడిక్షన్’ అంశాన్ని చర్చించబోతున్నారు. ఈ అంశంపై  ఇటీవల జరిపిన చర్చలో ప్రముఖ నటుడు నవదీప్ అతిథిగా పాల్గొన్నారు. ‘హై ఆన్ లైఫ్’ పేరుతో ఈ డిస్కషన్ జరిగింది. మన జీవితంలో డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అనే అంశం మీద న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్ తో కలిసి నవదీప్ తమ సూచనలు, అనుభవాలు తెలిపారు. వ్యసనం అనేది మన మనసుకు సంబంధించిన విషయం, దీన్ని అధిగమించేందుకు విలువైన సలహాలు ‘హై ఆన్ లైఫ్’ డిస్కషన్ లో
అందించనున్నారు. కాగా నవదీప్ పాల్గొన్న షో ఎపిసోడ్ త్వరలో విడుదల కానుంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us