ఈ సంవత్సరం చాలా మంది డైరెక్టర్లకు సక్సెస్ ఫుల్ ఇయర్ అయ్యింది. 2024లో బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా విడుదల థియేటర్లలు సూపర్ సక్సెస్ అయిన సినిమాలు అనేకం. అటు కొత్త దర్శకులకు ఈ ఏడాది కలిసి వచ్చింది. భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజై మంచి వసూళ్లు రాబట్టాయి. మరోవైపు వచ్చే ఏడాది సైతం భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో సక్సెస్ అయిన డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందామా.
ఈ ఏడాది చివర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 దాదాపు రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన సంగతి తెలిసిందే.
ఇక అంతకు ముందు డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
అలాగే ఈ ఏడాది ప్రారంభంలోనే సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా రూ.300 కోట్లు రాబట్టింది.
అలాగే లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు వెంకీ అట్లూరి. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈసినిమా స్టోరీ, డైరెక్షన్ చూసి వెంకీ అట్లూరిపై ప్రశంసలు కురిపించారు.
మరోవైపు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఖాతాలో భారీ హిట్టు పడింది. ఈ ఏడాది ఆయన నటించిన క సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే విజయం సాధించారు ఈ ఇద్దరు.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో దర్శకుడిగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ.
అలాగే కీరవాణి కొడుకు హీరోగా నటించిన మత్తు వదలరా 2 సినిమా హిట్ కావడంతో దర్శకులుగా రితేశ్ సక్సెస్ అయ్యాడు. అలాగే కమిటీ కుర్రోళ్లు సినిమాతో తొలి పరిచయంలోనే దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు యదువంశీ. ఆ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్ బుష్ సినిమాతో దర్శకుడిగా మెప్పించాడు డైరెక్టర్ హర్ష.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.