బిగ్ బాస్‌లోకి సీరియల్ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియాలోనే ఇలా ఉంటే.. ఇక హౌస్‌లో ఇక రచ్చ రచ్చే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ సెప్టెంబర్ 07 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నయని సమాచారం. ఈ క్రమంలో గ్రాండ్ లాంచింగ్ కు సెలబ్రిటీలు ఎవరెవరు రానున్నారోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్‌లోకి సీరియల్ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియాలోనే ఇలా ఉంటే.. ఇక హౌస్‌లో ఇక రచ్చ రచ్చే
Biggboss 9

Updated on: Sep 02, 2025 | 1:50 PM

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. ఈసారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. అలాగే ఈసీజన్ 9లో సామాన్యులకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో పలువురిని హౌస్‌లోకి పంపించనున్నారు. ఇందుకోసం అగ్నిపరీక్ష అనేది మొదలు పెట్టారు. సామాన్యులను సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అనే షోను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియకు ముగ్గురు జడ్జిలు ఉండనున్నారు. బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్‏బాస్ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి, బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఫిల్టర్ చేశారు కూడా.. ఈ ప్రాసెస్ జెట్ స్పీడ్‌తో జరుగుతుంది.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ సీరియల్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

బ్రహ్మముడి సీరియల్ తో ఎంతో మంచి నటీమణులు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారిలో షర్మిత గౌడ ఒకరు.. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్ లో నెగిటివ్ రోల్ లో అదరగొడుతున్న షర్మిత.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. అలాగే సీరియల్ లో పద్దతిగా ఉండే ఈ బ్యూటీ.. బయట మాత్రం యమా హాట్ గురూ.. సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తుంది షర్మిత. ఇక ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత.. నిజంగానే షర్మిత గౌడ బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.