పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం విడుదల పార్ట్ 2. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విప్లవ హీరోగా కనిపించాడు. ఈ సినిమా తర్వాత ఏస్, ట్రైన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు.

పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
Puri Jagannadh, Vijay Sethu

Updated on: Apr 17, 2025 | 11:42 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ గతకొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసినా కూడా ఈ స్టార్ దర్శకుడు హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా పూరి డైలాగ్స్ , హీరోల మ్యానరిజం ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు పూరి ఎవరితో సినిమా చేయనున్నారు.? ఎలాంటి స్టోరీతో రానున్నాడు అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే పూరి ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ఇటీవలే విజయ్ సేతుపతిని కలిసి సినిమా కథ కూడా వినిపించారట పూరి. ఇక కథ నచ్చడంతో సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో టబు విలన్ గా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని పైనే చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా బాలకృష్ణ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ చిన్నది చాల సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పూరి సినిమాలో రాధికా ఆప్టే  హీరోయిన్ గా ఎంపికైందని టాక్. ఇటీవలే రాధికకు కథ చెప్పి ఒప్పించారట పూరి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.