చాలా మంది హీరోయిన్ తెలుగులో సినిమాలు చేసి ఆపై తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకొని స్టార్స్ గా మారారు. కాగా కొంతమంది బాలీవుడ్ కు చెక్కేశాక తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించారు. రీసెంట్ డేస్ లో రకుల్, తమన్నా కూడా బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ టాలీవుడ్ లో జోరు తగ్గించారు. అంతకు ముందుకు కూడా చాలా మంది అందాల భామలు టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ చేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఆ అమ్మడు. యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది. దాంతో బాలీవుడ్ కు చెక్కేయాలని డిసైడ్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
హీరోయిన్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు. ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.
ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫఫోకస్ పెడుతుంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇదంతా బాలీవుడ్ లో అవకాశాల కోసమే అని అంటున్నారు. మరి నిజంగానే ఈ అమ్మడు టాలీవుడ్ కు దూరం అవుతుందా లేదా అనేది చూడాలి.