Liger: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రస్తుతం తన దృష్టి అంతా లైగర్ సినిమా పైనే పెట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
ఇక లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే మైక్ టైసన్ , విజయ్ దేవరకొండలపై సన్నివేశాలను చిత్రీకరరించారు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. అదిరి పోయే అప్డేట్స్ తో 2021 కు గుడ్ బై చెప్పాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ క్రమంలో.. డిసెంబర్ 29 ఉదయం 10:03 గంటలకు `ది బిగ్ అనౌన్స్మెంట్` పేరుతో ఓ వీడియో రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 30 ఉదయం 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్స్ ని విడుదల చేయనున్నారు. ఇక డిసెంబర్ 31 న `లైగర్` ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఓ టైం టేబుల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక లైగర్ సినిమాకోసం తనను తాను మార్చుకున్నాడు విజయ్.. ప్రొఫిషనల్ బాక్సర్ గా కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు ఈ క్రేజీ హీరో.
మరిన్ని ఇక్కడ చదవండి :