Ranabaali: ఏపీ ప్రభుత్వ పన్ను రాయితీ పొందే అర్హత ఉన్న సినిమా విజయ్ దేవరకొండ ‘రణబాలి’

1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, అదే సమయంలో బ్రిటిష్ పాలకుల ఆగడాలను అరికట్టేందుకు 'రణబాలి' అనే పాలేగాడు చేసిన పోరాట ఇతివృత్తమే ఈ సినిమా. ఈ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదన వినిపిస్తోంది.

Ranabaali: ఏపీ ప్రభుత్వ పన్ను రాయితీ పొందే అర్హత ఉన్న సినిమా విజయ్ దేవరకొండ రణబాలి
Ranabaali Movie

Updated on: Oct 23, 2026 | 8:37 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ మూవీ రణబాలి ప్రేక్షకుల ఆదరణతో అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కుతున్నాయి. రాయలసీమ గడ్డపై జరిగి, చరిత్రలో మరుగుపరిచిన చారిత్రక ఘటనల స్ఫూర్తితో, సీమ వీరుల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. ఇలాంటి చారిత్రక నేపథ్య సినిమాలకు ప్రభుత్వాలు పన్ను రాయితీలు కల్పించడం చూస్తున్నాం. గతంలో గౌతమీపుత్రశాతకర్ణి సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. పాఠ్య పుస్తకాల్లో నేర్పించని చరిత్రను, మనకు తెలియకుండా దాచిన హిస్టరీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన రణబాలి వంటి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్నురాయితీ ఇస్తే బాగుండేది అనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. పన్ను రాయితీ కోసం నిర్మాతలు ప్రభుత్వానికి అభ్యర్థన చేయాల్సింది. ఈ పన్ను రాయితీ వల్ల ఆర్థికంగా సినిమా వచ్చే లాభం కంటే ఒక ప్రత్యేక గౌరవం ఈ సినిమా దక్కేది. ఈ విషయంలో చిత్రబృందం చొరవ చూపించి ఉండాల్సింది. రణబాలి వంటి చిత్రాల వల్ల మన చరిత్ర గొప్పదనం, మన వీరుల త్యాగం, పోరాటం గురించి భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఏర్పడుతోంది.

దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబాలి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లోఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది. అలాగే సీనియర్ నటి ఈశ్వరీ రావు మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో ఈ మూవీలో విలన్ గా నటించడం విశేషం.  అజయ్–అతుల్ ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us