Vijay Deverakonda: ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వారు బాగా ఎంజాయ్ చేశారు.. ‘రణబాలి’ రిలీజ్ వేళ విజయ్ కామెంట్స్ వైరల్

రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకన్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Vijay Deverakonda: ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వారు బాగా ఎంజాయ్ చేశారు.. రణబాలి రిలీజ్ వేళ విజయ్ కామెంట్స్ వైరల్
Vijay Deverakonda

Updated on: Oct 14, 2026 | 11:28 AM

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఈ రోజు ఈవెంట్ కు వచ్చిన నా డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్. వాళ్లలో కొందరితో వర్క్ చేశా. మరికొందరితో చేయబోతున్నా. మీలాంటి మంచి డైరెక్టర్స్ వల్లే నేను రోజూ హ్యపీగా షూట్ కు వెళ్తున్నా. తిరుపతి బ్రహ్మోత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ పండుగ, విజయవాడలో ఉత్సవాలు మొదలయ్యాయి, పిల్లలకు హాలీడేస్ మొదలయ్యాయి. అంతటా ఒక పండుగ వైబ్ ఉంది. ఈ నెల 16న తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా రణబాలి వస్తోంది. రాహుల్ తన నెక్ట్స్ మూవీ రూరల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ చేయాలనుకున్నప్పుడు ఆయన ఊరికి వెళ్లి అక్కడ కథలు వింటూ, జాతరలు, పండుగలు చూస్తూ. ఆ జాతరలో చెప్పే బుర్రకథలు, జానపదాలు వింటూ అందులోని వీరుల గురించి తెలుసుకున్నాడు. వాటి నుంచి ఒక భారీ నేపథ్యమున్న సినిమాను ఊహించాడు. ఈ సినిమా గురించి వర్క్ చేస్తుంటే చరిత్రలో దాచిన కొన్ని అధ్యాయాల గురించి రాహుల్ తెలుసుకున్నాడు. అప్పుడు ఈ రణబాలి సినిమాకు ఒక గొప్ప పర్పస్ ఏర్పడింది. రాహుల్ నాతో ఒక రూరల్ మాస్ సినిమా చేసినా, ఒక హిస్టారికల్ యాక్షన్ సినిమా చేసినా ఇంత మజా వచ్చి ఉండేది కాదేమో. రాహుల్ తను చెప్పాలనుకున్న పీరియడ్ యాక్షన్ ఫిలిం, ఒక పర్పస్ ఫుల్ ఎలిమెంట్ ఏదీ వదలకుండా బ్యూటిపుల్ గా స్క్రిప్ట్ చేసి రణబాలి సినిమా రూపొందించాడు. రాహుల్ తన కెరీర్ కొనసాగించడానికి సినిమాలు చేయడు, కొన్ని గొప్ప కథలు చెప్పేందుకు సినిమాలు రూపొందిస్తాడు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు సూపర్ ఎల్ నినో ప్రభావం గురించి చెప్పారు. ప్రజల్ని జాగ్రత్తగా ఉండమన్నారు. సరిగ్గా 150 ఏళ్ల క్రితం సూపర్ ఎల్ నినో వచ్చింది. అదే గ్రేట్ మద్రాస్ ఫామైన్. ఆ టైమ్ లో బ్రిటీషర్స్ చేసిన ఘోరాల వల్ల ఆ మహా కరువు 80 లక్షల మంది చావుకు కారణమైంది. ఒక సైకిల్ లా ఆ ఎల్ నినో రిపీట్ అవుతున్నా, మనం మన పూర్వీకులు చూసిన బాధలు చూడకూడదు. అందుకే మనం నీళ్లు, కరెంట్, ఫుడ్ ను జాగ్రత్తగా వృథా చేయకుండా చూసుకోవాలి. సీఎం గారు చెప్పారంటే అది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లే దమ్ము మన ఇండియన్స్ లో ఉంది’

‘టాక్సీవాలా సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. అయితే రిలీజ్ టైమ్ కు చాలా ఇబ్బందులు ఎదురొచ్చాయి. అప్పటికి నా నోటా మూవీ సరిగ్గా ఆడలేదు. అందరు నన్ను ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో నేను కూడా ఫీల్ అయ్యాను. అప్పుడు అందరికీ ఐ విల్‌ బీ బ్యాక్ ‍అని లెటర్ రాశాను. అయితే కొందరు నా సినిమా ఫెయిల్యూర్‌ చూసి ఎంజాయ్ చేశారని తెలిసింది. అందుకే నా ఈగో హార్ట్ ‍అయింది. నేను మళ్లీ పుంజుకుంటా అని ఒక లేఖ రాశాను. ఆ మాట నిలబెట్టుకుంటూ టాక్సీవాలా సక్సెస్ మీట్ లో మాట్లాడాను. రాహుల్.. రణబాలితో నాకు అలాంటి మరో వేదిక ఇవ్వబోతున్నావు. మన మీద మనకు నమ్మకం, చేసే పనిలో ప్రాణం పెట్టి కష్టపడటం ఈ రెండే మన చేతిలో ఉంటాయి. తెలుగు సినిమా గ్లోబల్ గా పేరు తెచ్చుకోవడంలో మైత్రీ సంస్థ పాత్ర కీలకంగా ఉంది. కథ నచ్చితే చాలు గొప్పగా స్క్రీన్ మీదకు ప్రాడక్ట్ తీసుకొస్తారు. మా కెరీర్ లో అజయ్ అతుల్ ఏందయ్యా సామీ అనే ఫరెవర్ క్లాసికల్ సాంగ్ ఇచ్చారు. రశ్మికతో నేను చేస్తున్న మూడో చిత్రమిది. నటిగా, పర్సన్ గా తను ఎంతో ఎదిగింది. రశ్మిక ఒక రోబోలా కష్టపడుతుంది. రశ్మిక సంపాదించిన గుర్తింపు చూసి గర్వపడుతుంటా. ఈ సినిమాకు రశ్మిక అవసరం. ఈ చిత్రంలో రణబాలి, రశ్మిక జంట ఇచ్చే ఇంపాక్ట్ కు రశ్మిక అయితేనే న్యాయం చేయగలుగుతుంది. ఈ నెల 16న థియేటర్స్ లో కలుద్దాం. సినిమా రిలీజ్ తర్వాత విజయవాడ, అనంతపూర్ వస్తాం’ అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us