AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giribabu: సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి.. ఐదు దశాబ్దాల్లో 500కు పైగా సినిమాలు

నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. 80ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు గిరిబాబు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గిరిబాబు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు

Giribabu: సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి.. ఐదు దశాబ్దాల్లో 500కు పైగా సినిమాలు
Giribabu
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2026 | 7:12 PM

Share

దాదాపు ఐదు దశాబ్దాలుగా.. 500కు పైగా సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్ రౌండర్ గిరిబాబు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు గిరిబాబు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ప్రాణం పెట్టే గిరిబాబుకు, 20 ఏళ్లకే వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా నాటకాల్లో వేషాలు వేస్తూ కాలం గడుపుతున్న సమయంలో.. ‘కొత్త నటులు కావాలి’ అన్న ప్రకటన చూసి తన ఫోటోలు పంపారు… ఆ ఫోటోలే ఆయన జీవితంలో మలుపుకు కారణమయ్యాయి. సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కారు గిరిబాబు. కానీ అక్కడ అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయి. వరుస వైఫల్యాలతో విసిగిపోయిన ఆయన ఒక దశలో సినిమా అవకాశాలు రావని తిరిగి సొంత ఊరు వచ్చేశారు. కొంత కాలం తర్వాత, మద్రాసులో ఓ దర్శకుడు గిరిబాబు గురించి ఆరా తీస్తున్నారని తెలిసి మళ్లీ సినిమా వైపు ప్రయాణం మొదలు పెట్టారు. కనీసం మద్రాసు వెళ్లడానికి టికెట్ డబ్బులు కూడా లేకపోవటంతో ఊరి నుంచి చెన్నై వెళుతున్న ధనియాల లారీ ఎక్కి చెన్నపట్నం చేరుకున్నారు. ఆ ప్రయాణమే తెలుగు తెరకు ఒక అద్భుతమైన విలక్షణ నటుడిని పరిచయం చేసింది.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు

1973 ఐఎస్‌ మూర్తి రూపొందించిన ‘జగమే మాయ’ సినిమాతో ఆయనకు బ్రేక్ దొరికింది. ఆయన కెరీర్ లో తొలి సక్సెస్ ఫుల్ సినిమాకు తీసుకున్న పారితోషికం 2500 రూపాయలు. మొదట్లో హీరో కావాలని అనుకున్నా… ఆయన ఆహార్యానికి ఎక్కువగా విలన్‌ అవకాశాలే వచ్చాయి. అలా 70, 80లలో విలన్ గా గిరిబాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా కూడా గిరిబాబు ప్రూవ్ చేసుకున్నారు. 1977లో రిలీజ్ అయిన దేవతలారా దీవించండి సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. 1984లో మెరుపు దాడి అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ కౌబోయ్ సినిమాను నిర్మించారు. ఆ రోజుల్లోనే ఆ సినిమా కోసం ఏకంగా 29 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనం. తర్వాత రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన చిన్న కుమారుడు బోసుబాబును ఇంద్రజిత్ సినిమాతో హీరోగా పరిచయం చేశారు.

చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్

90లలో విలన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా టర్న్ తీసుకున్నారు గిరిబాబు. ముఖ్యంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమాలో ఆయన పండించిన కామెడీ ఎవర్ గ్రీన్. హీరో నుంచి విలన్ గా, కమెడియన్ గా ఐదు దశాబ్దాల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు. 2012లో అమెరికాకు చెందిన వెస్ట్‌బ్రూక్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. గిరిబాబు పెద్ద కుమారుడు రఘుబాబు కమెడియన్‌గా కొనసాగుతున్నారు. 2016లో గిరిబాబు సతీమణి శ్రీదేవి మరణించారు. ఆ తరువాత ఆయన పూర్తిగా స్వగ్రామం రావినూతలలోనే ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us