Uppena Second Day Collections: రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు

  ఉప్పెన చిత్రం అదరగొడుతోంది. కలెక్షన్లతో దుమ్మురేపుతోంంది. డెబ్యూ మూవీతోనే  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన మార్క్ చూపిస్తున్నాడు.

Uppena Second Day Collections: రెండో రోజు కూడా ఉప్పెన.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు

Updated on: Feb 14, 2021 | 1:39 PM

Uppena Second Day Collections:  ఉప్పెన చిత్రం అదరగొడుతోంది. కలెక్షన్లతో దుమ్మురేపుతోంంది. డెబ్యూ మూవీతోనే  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన మార్క్ చూపిస్తున్నాడు. తొలిరోజు రూ.10. 42 కోట్ల షేర్ రాబట్టి.. అందర్నీ ఆశ్చర్యచపరిచిన ఉప్పెన చిత్రం.. రెండో రోజు రయ్యి మంటూ దూసుకుపోయింది. వరల్డ్ వైడ్ రెండో రోజు ఉప్పెన చిత్రం 17. 77 కోట్లు షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్‌కి దగ్గరైంది. ఇందులో నైజాం+ ఏపీ రూ.16. 7.3 కోట్లు రావడం గమనించదగ్గ అంశం.

ఇక  ఏరియా వైజ్ కలెక్షన్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి…

  1. నైజాం.. ఫస్ట్ డే రూ.3. 08 కోట్లు, రెండో రోజు 5. 76 కోట్లు
  2. ఈస్ట్ తొలిరోజు.. రూ. 0.98 కోట్లు, రెండో రోజు 1. 63 కోట్లు
  3. వెస్ట్ తొలిరోజు రూ. 0.81 కోట్లు.. రెండో రోజు 1. 13 కోట్లు
  4. క్రిష్ణా తొలిరోజు రూ. 0.62 కోట్లు.. రెండో రోజు 1.10 కోట్లు
  5.  వైజాగ్ ఫస్ట్ డే రూ. 1. 43 కోట్లు, రెండో రోజు 2. 67 కోట్లు
  6. గుంటూరు ఫస్ట్ డే రూ. 0.65 కోట్లు, రెండో రోజు 1. 42 కోట్లు
  7. నెల్లూరు తొలిరోజు రూ. 0.35 కోట్లు, రెండో రోజు 0.58 కోట్లు

 

నైజాం+ ఏపీ మాత్రమే చూస్తే.. మొదటిరోజు. రూ. 9.3 కోట్లు రాబట్టగా, రెండో రోజు 16. 73 కోట్లు వసూళ్లు వచ్చాయి.   కాగా ఈ చిత్రం  22 కోట్ల మార్క్ రీచ్ అయితే  బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లే. ఆదివారం అందునా వేలంటైన్స్ డే కావడంతో.. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెగా మేనల్లుడు కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసేలానే కనిపిస్తున్నాడు.

Also Read:

 

Loading...
Unable to load recommendations.
Follow Us