Tollywood: ఇతను రియల్ హీరో.. HYDలో తన 170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

హైదరాబాద్ లో భూముల ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గజం భూమి కొనాలన్నా లక్షలు, కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. అలాంటిది ఒక టాలీవుడ్ హీరో హైదరాబాద్ లో తనకు ఉండే 170 ఎకరాల భూమిని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేశారు.

Tollywood: ఇతను రియల్ హీరో.. HYDలో తన 170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Tollywood Actor

Updated on: Jul 08, 2026 | 7:14 PM

ఇతర సినిమా ఇండస్ట్రీ హీరోలతో పోల్చితే టాలీవుడ్ హీరోలకు సామాజిక స్పృహ ఎక్కువ. చాలా మంది హీరోలు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లతో సేవలు అందిస్తోంటే బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఎంతో మంది పేదలకు ఉచితంగా సేవలందిస్తున్నారు. వీరే కాదు చాలా మంది హీరోలు అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తూ ఏదో ఒక రకంగా తమ ఉదారతను చాటుకుంటూనే ఉన్నారు. అయితే వీరిలో కొందరు హీరోలు ఎలాంటి పబ్లిసిటీలు, ప్రచారాలు లేకుండా గుప్త దానాలు చేస్తుంటారు. అంటే కుడిచేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు కదా.. ఈ మాటను పాటిస్తూ కొంత మంది ఎవరికీ తెలియకుండా ఎన్నో గొప్ప పనులు చేస్తుంటారు. అలా ఓ టాలీవుడ్ హీరో కూడా సైనికుల కోసం హైదరాబాద్ లో వందల కోట్ల విలువ చేసే 170 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేశారు. అతను మరెవరో కాదు ఒకప్పటి యాక్షన్ హీరో సుమన్.

చాలా ఏళ్లుగా సినిమాల్లో నటిస్తోన్న సుమన్ హైదరాబాద్ కు దగ్గరలో భువనగిరి ప్రాంతంలో సుమారు 170 ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. అక్కడ ఓ సినిమా స్టూడియో కట్టుకుని ఆపై కమర్షియల్ గా వాడుకోవచ్చని అనుకున్నారట . అయితే అయితే అదే సమయంలో కార్గిల్ వార్ జరగడం, అందులో ఎంతో మంది భారతీయ సైనికులు వీర మరణం పొందడం సుమన్ ను కలిచివేసిందట. దాంతో అమర జవానుల కోసం తన వంతు ఏదైనా చేయాలి అనుకున్నాడట. అలా భువనగిరి ప్రాంతంలో ఉన్న తన 170 ఎకరాల భూమిని సైనికులు, వారి కుటుంబాలకు రాసి ఇచ్చారట. అయితే ఈ విషయం చాలా కాలంగా చాలా మందికి తెలియదు. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తేనే సుమన్ దీని గురించి చెప్పుకొచ్చారు. ఈ భూమిని సైనికులకు ఇవ్వాలన్న ఆలోచన తన భార్య ఇచ్చినదేనని సుమన్ చెప్పుకొచ్చారు. తన భార్య చాలా మంచి విషయం చెప్పిందని, అందుకే ఒక్కమాట ఆలోచించకుండా ఆ భూమిని సైనికులకు ఇచ్చేశానన్నారు సుమన్. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. సుమన్ దానగుణంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు సుమన్. అయితే మధ్యలో కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో రేసులో వెనకబడిపోయారీ హీరో. అయితే ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగి వచ్చి సినిమాలు చేశారు సుమన్. ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా బిజీ బిజీగా ఉంటున్నారీ సీనియర్ యాక్టర్. అలాగే బుల్లితెరపైనా మెరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Actor Suman

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us