కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటివరకు కన్నడ ఆడియన్స్ కు మాత్రమే తెలిసిన యష్ .. కేజీఎఫ్ తర్వాత అన్ని భాషల్లో ఫెమ్స్ అయ్యాడు. అలాగే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు యష్. ఇదిలా ఉంటే హీరో పెద్ద విజయం సాధించినప్పుడు, చాలా మంది అతన్ని వివిధ నటులతో పోల్చడం మనం చూస్తూ ఉంటాం.. కొందరు దీనిని అభినందనగా భావిస్తారు. మరికొందరు ఒప్పుకోరు. ఇంతకు ముందు రాకింగ్ స్టార్ యష్ ని టాలీవుడ్ హీరో ప్రభాస్ తో పోల్చారు. దాని పై యష్ రియాక్షన్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.
అది ‘కేజీఎఫ్ 2’ విడుదల సమయంలో యష్ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సమయంలో యష్ కూడా హిందీ మీడియాతో మాట్లాడాడు. అప్పుడు ఇంటర్వ్యూయర్ అభిమానుల కామెంట్స్ ను చదివి వినిపించాడు. అందులో ఓ ఫ్యాన్ మిమల్ని నెక్స్ట్ బాలీవుడ్ ప్రభాస్ అంటున్నారు. మీరేమంటారు అని అడగ్గా. దీన్ని యష్ ప్రేమతో సమాధానం ఇచ్చాడు.. తమను ఇతరులతో పోల్చవద్దని చెప్పాడు.
‘దీనిపై యష్ స్పందిస్తూ. ‘నేను మొదట యష్ మాత్రమే. ప్రభాస్ మంచి ఆర్టిస్ట్. అతను పెద్ద స్టార్. ప్రభాస్ చాలా సాధించాడు. ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆకర్షణ ఉంటుంది. నేను దానిని అభినందనగా తీసుకుంటాను.. మొదటి నుంచి నాకు ఒకరితో పోల్చితే నచ్చదు. అలా చేయకూడదు’ అన్నాడు యష్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక యష్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. అదేవిధంగా యష్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. హిందీలో ‘రామాయణం’ అనే సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.