Actress : స్టార్ హీరోతో ఆగిపోయిన మూవీ.. దెబ్బకు 9 సినిమాల నుంచి అవుట్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..
సినీ రంగుల గ్లామర్ ప్రపంచంలో నటిగా ఓ గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఎన్నో సవాళ్లు.. మరెన్నో అడ్డంకులు దాటుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అలాగే కెరీర్ మొదట్లోనే ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం తన తలరాతను మార్చుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే తనదైన ముద్ర వేసింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకుంది. అయితే కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ అనుహ్యంగా ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. కట్ చేస్తే.. రాత్రికి రాత్రే ఆమెను 9 సినిమలా నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ విద్యా బాలన్. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన తొలి సినిమా రోజుల్లో తనను అపశకునం అని.. ఐరెన్ లెగ్ అని పిలిచారని.. అప్పట్లో ప్రతి రాత్రి తాను ఏడుస్తూ నిద్రపోయేదాన్ని అని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ సరసన చక్రం అనే సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపింది. ఆ సినిమా కోసం దక్షిణాదిలో ఒక యాడ్ షూట్ జరుగుతున్నప్పుడు, తాను అక్కడికి వెళ్ళగా ఆ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని తనను అడిగారని అన్నారు. హీరో మోహన్ లాల్ కావడంతో తాను వెంటనే ఒప్పుకున్నానని.. ఆడిషన్ అయిన వెంటనే దర్శకుడు తనను కలవాలనుకోవడంతో, తాను తన సోదరి, తల్లితో కలిసి అక్కడికి వెళ్ళానని విద్యా తెలిపింది. “నేను సినిమా మొదలుపెట్టాను, షూటింగ్ బాగా జరిగింది. 15 రోజుల తర్వాత వాళ్ళు నన్ను బొంబాయికి తిరిగి పంపించేశారు. మేము ఒక సీన్ చేశాము, వాళ్ళు షెడ్యూల్ పూర్తయిందని, మేము మొత్తం సినిమాను ఒకేసారి చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. మోహన్‌లాల్ సార్‌కు కొన్ని డేట్స్ సమస్యలు ఉన్నాయని, అందుకే మేము విరామం తీసుకుని వచ్చే నెలలో తిరిగి వస్తామని చెప్పారు. దర్శకుడికి, మోహన్‌లాల్‌కు సమస్యలు ఉండటంతో మేము చాలా రోజులు షూటింగ్ చేయలేదు. అందుకే ఇలాగే జరగాలేమో అని నేను అనుకున్నాను. అలా నేను సంతోషంగా బొంబాయికి తిరిగి వచ్చాను.”
ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..
“నేను ఒక స్టార్‌ని అని మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మోహన్‌లాల్ నటించిన ‘చక్రం’ సినిమా ఆగిపోతుందని నాకు అస్సలు తెలియదు. అది ఆగిపోయిన తర్వాత, నాకు ఆఫర్ చేసిన ఆ 8, 9 సినిమాలన్నీ నేను కోల్పోయాను. ఆ నటుడు, దర్శకుడు కలిసి 8 హిట్లు ఇచ్చారని, ఇప్పుడు వాళ్ళు తమ 9వ సినిమా చేస్తున్నారని అనుకున్నారు. అందుకే, బహుశా ఇది ఈ అమ్మాయి శక్తి వల్లేమో, ఈమెకు ఏదో అపశకునం తగిలిందేమో అన్నారు. అది ఒక పిచ్చి సమయం. చాలా నిరాశ కలిగించిన కాలం. ఈమెకు కనీసం ఒక్క సినిమా అయినా కలిసి రావాలని మా తల్లిదండ్రులు ప్రార్థించడం మొదలుపెట్టారు. నేను ఎదుర్కొంటున్న తిరస్కరణను, నిరాశను వాళ్ళు చూడగలిగారు. ఏడుస్తూ పడుకునేదాన్ని, కానీ ఆశ మాత్రం కోల్పోలేదు.” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
విద్యా బాలన్ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
