Sankranti Movies : సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..

|

Jan 04, 2025 | 1:10 PM

లైఫ్‌లో ఏం అవుదాం అనుకుంటున్నావ్..! IAS, IPS లాంటివి కాకుండా..! ఈ డైలాగ్ గుర్తుంది కదా.. మరిచిపోయేలా చెప్పాడా మన వెంకీ అనుకుంటున్నారు కదా..? ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా..? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఎక్స్‌క్లూజివ్ స్టోరీకి.. ఈ డైలాగ్‌కు అదిరిపోయే కనెక్షన్ ఉంది. అదేంటో చూద్దామా..?

Sankranti Movies : సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
Sankranthiki Movies
Follow us on

సంక్రాంతికి ఇంకా వారం రోజుల టైమ్ కూడా లేదు.. అందుకే ఓవైపు రామ్ చరణ్.. మరోవైపు బాలయ్య.. ఇంకోవైపు వెంకటేష్.. ఎవరూ తగ్గట్లేదు.. ఎవరికి వాళ్లు ప్రమోషన్స్ ఇరక్కొడుతున్నారు. ఈ మూడు సినిమాల్లోని హీరో కారెక్టర్స్‌లో ఓ కామన్ పాయింట్ ఉంది. దాని గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు చేస్తున్నారు.. అందులో ఒకటి అప్పన్న అనే రాజకీయ నాయకుడు కాగా.. మరోటి రామ్ నందన్ ఐఏఎస్. ఈ రెండు కారెక్టర్స్‌పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శంకర్. అలాగే ట్రైలర్‌లో పోలీస్ గెటప్ కూడా కనిపించింది. అది సస్పెన్స్ మెయింటన్ చేస్తున్నారు. మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎక్స్ కాప్ అంటే.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : దిమ్మతిరిగింది సామి..! ఈ టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్స్.. ప్రభాస్ ఫ్రెండ్ సిస్టర్సా..!!

గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ IAS.. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ పోలీస్ కారెక్టర్స్‌పై క్లారిటీ ఉంది కానీ తాజాగా డాకూ మహరాజ్‌పై అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఇందులో బాలయ్య IAS ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఇందులో మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు బాలయ్య. అందులో IAS ఆఫీసర్ పాత్ర గోప్యంగా ఉంచారు దర్శకుడు బాబీ.

ఇది కూడా చదవండి : Kanchana 4: దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ.. కాంచన 4లో ఆ క్రేజీ భామ

డాకూ మహరాజ్‌లో అంతా డాకూ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు కానీ సర్‌ప్రైజింగ్ కారెక్టర్ అయితే IAS అని తెలుస్తుంది. దర్శకుడు బాబీ ఈ పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదే నిజమైతే సంక్రాంతికి రాబోయే 3 సినిమాల్లోనూ హీరోలు గవర్నమెంట్ అఫీషియల్సే అన్నమాట. మరి ఈ ముగ్గురిలో బాక్సాఫీస్‌పై ఛార్జ్ ఎవరు తీసుకుంటారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి