Theatre – OTT Movies: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలివే.. లిస్టులో ధనుష్‌ మూవీ కూడా..

|

Aug 16, 2022 | 9:42 AM

Upcoming Telugu movies: విజయ పరంపరను కొనసాగించేందుకు మరికొన్ని సినిమాలు ఈ వారంలో థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఈ వారం భారీ చిత్రాలు లేకపోయినా ఆకట్టుకునే చిన్న చిత్రాలు ఉన్నాయి. మరోవైపు ఎప్పటిలాగే ఓటీటీలో కొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి.

Theatre - OTT Movies:  ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలివే.. లిస్టులో ధనుష్‌ మూవీ కూడా..
Theatare Ott Movies
Follow us on

Upcoming Telugu movies: టాలీవుడ్‌కు జులై మాసం నిరాశమిగిల్చినా ఆగస్టు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మొదటి వారంలో బింబిసార, సీతారామం సినిమాలతో థియేటర్లు కళకళలాడితే, రెండో వారంలో కార్తికేయ మరింత జోరు చూపించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులే ఆదరిస్తారన్న భరోసాను ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు మరికొన్ని సినిమాలు ఈ వారంలో థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఈ వారం భారీ చిత్రాలు లేకపోయినా ఆకట్టుకునే చిన్న చిత్రాలు ఉన్నాయి. మరోవైపు ఎప్పటిలాగే ఓటీటీలో కొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. మరి ఆగస్టు మూడో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

తిరు

ఇవి కూడా చదవండి

కోలీవుడ్ సూపర్‌స్టార్‌ ధనుష్‌ నటించిన ప్రేమకథా చిత్రం తిరు. రాఖీఖన్నా, నిత్యామేనన్‌ హీరోయిన్లుగా నటించారు. ప్రియా భవానీ శంకర్‌, ప్రకాశ్‌రాజ్‌, భారతీరాజా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత సారథ్యం వహించారు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో ఈ లవ్‌స్టోరీపై మంచి అంచనాలే ఉన్నాయి. కృష్ణాష్టమి కానుకగా ఆగస్టు 18న ఈ సినిమా విడుదల కానుంది.

తీస్‌ మార్‌ఖాన్‌

యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌, హాట్‌బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం తీస్‌మార్‌ఖాన్‌. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్‌ జి.గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు.

వాంటెడ్‌ పండుగాడ్‌

బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వాంటెడ్‌ పండుగాడ్‌. సప్తగిరి, సునీల్‌, అనసూయ, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, దీపికా పిల్లి, విష్ణుప్రియ ఇలా భారీ తారగణమంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీధర్‌ సీపాన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు 19న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

వీటితో పాటు అం.. అః, మాటరాని మౌనమిది లాంటి చిన్న సినిమాలు కూడా ఆగస్టు 19న థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాయి.

ఓటీటీలో సినిమాలివే..

ఆహా

  • హైవే (తెలుగు)- ఆగస్టు 19
  • జీవీ 2- ఆగస్టు 19

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • షి హల్క్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 17
  • హెవెన్‌- ఆగస్టు 19
  • హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 22

జీ 5

  • దురంగ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 19
  • యానై- ఆగస్టు 19

సోనీ లివ్‌

  • తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌ సిరీస్‌- ఆగస్టు 19

నెట్‌ఫ్లిక్స్‌

  • రాయల్‌టీన్‌ (హాలీవుడ్)- ఆగస్టు 17
  • లుక్‌ బోత్‌ వేస్‌(హాలీవుడ్)- ఆగస్టు 17
  • హీమ్యాన్‌ (హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 18
  • టేకేన్‌ బ్లడ్‌ లైన్‌ (హాలీవుడ్ యానిమేషన్‌ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 18
  • ది నెక్ట్స్‌ 365 డేస్‌ (హాలీవుడ్)- ఆగస్టు 19
  • ఎకోస్‌ (హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 19
  • ది గర్ల్‌ ఇన్‌ ది మిర్రర్‌ (హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 19
  • యాడ్‌ ఆస్ట్రా (హాలీవుడ్)- ఆగస్టు 20
  • ఫుల్‌ మెటల్‌ ఆల్కమిస్ట్‌ ( హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 20
  • షెర్డిల్‌ (బాలీవుడ్‌) – ఆగస్టు 20

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..