AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thella Kaagitham: విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెల్లకాగితం మెలోడీ.. సాంగ్ భలే ఉందిగా

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘తెల్ల కాగితం’ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే మెలోడీ గీతం విడుదల విడుదల చేశారు. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి, హర్ష్ రోషన్ ఇటీవలే వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.

Thella Kaagitham: విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెల్లకాగితం మెలోడీ.. సాంగ్ భలే ఉందిగా
Tella Kagitham
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2026 | 8:58 PM

Share

శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం.. అనుదీప్ దేవ్, లిప్సిక గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్‌ను మనసుని హత్తుకునేలా ఉంది. లిరికల్ వీడియో ఎంతో అందంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల జంట.. వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ పాటకు అదనపపు ఆకర్షణ కానున్నాయి.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి గుహన్ కెమెరామెన్‌గా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 2న గ్రాండ్‌గా ఈ ఈ మూవీని విడుదల చేయబోతోన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన హర్ష్ రోషన్. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు. కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే బ్యాడ్ మేళం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు హర్ష్ రోషన్. ఇక ఇప్పుడు తెల్ల కాగితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమా హర్ష్ రోషన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us