తెలంగాణ ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను’ సెన్సేషన్.. “బిలియన్” వ్యూస్ !!

తెలంగాణ ఫోక్ సాంగ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు అయినా నేడు అయినా జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రజలను మెప్పిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఈ హవా మరింత పెరిగిందని చెప్పాలి. ఇటీవల ట్రెండింగ్ గా మారిన 'రాను బొంబాయికి రాను' పాట ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించింది.

తెలంగాణ ఫోక్ సాంగ్ రాను బొంబాయికి రాను సెన్సేషన్.. బిలియన్ వ్యూస్ !!
Telangana Folk Song

Updated on: Nov 17, 2026 | 4:09 PM

తెలంగాణ ఫోక్ సాంగ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు అయినా నేడు అయినా జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రజలను మెప్పిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఈ హవా మరింత పెరిగిందని చెప్పాలి. ఈ పల్లె పాటలకు సోషల్ మీడియా కూడా కొత్త ప్రమోషన్ గా మారడంతో.. యూట్యూబ్ లో ఈ ఫోక్ సాంగ్స్ భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమా పాటలను మించిన రెస్పాన్స్ కూడా కొన్ని పాటలు సంపాదించుకుంటున్నాయి అంటే అతిశయోక్తి కాదనే అనాలి. ఇటీవల ట్రెండింగ్ గా మారిన ‘రాను బొంబాయికి రాను’ పాట ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించింది.

ఈ సాంగ్ 2025 లో విడుదలవ్వగా.. ఇప్పటివరకు యూట్యూబ్ లో 956 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఈ పాట మిలియన్లలో వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకుపోవడం ట్రెండింగ్ గా మారింది. సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ ఈ పాటను రాయడమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. కేవలం రూ. 3 నుంచి 5 లక్షల బడ్జెట్‌తో వేములవాడ, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సాంగ్ సృష్టించిన సునామీకి యూట్యూబ్ యాడ్స్, ట్రెండింగ్ ద్వారా క్రియేటర్లకు సుమారు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంచనా వేస్తున్నారు.

ఫుల్ ట్రెండింగ్..

కాగా తెలంగాణ పల్లెటూరి యాస, సహజమైన పదాలు, గ్రామీణ నేపథ్యం ఈ రాను బొంబాయికి రాను పాటకు ప్రాణం పోశాయనే చెప్పాలి. పెళ్లిళ్లు, పండగలు, కాలేజీ ఈవెంట్లు, జాతరలు.. ఎక్కడ చూసినా ఇప్పటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. దాదాపు 16 సంవత్సరాలుగా జానపద సంగీత రంగంలో ఉన్న రాము రాథోడ్‌కు ఈ ఒక్క పాట ఓవర్ నైట్ స్టార్ డమ్ తీసుకొచ్చిందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ పాట ఇచ్చిన క్రేజ్‌తోనే ఆయనకు ప్రముఖ టెలివిజన్ షో “బిగ్ బాస్” లో సైతం పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ కొన్ని పర్సనల్ కారణాల రీత్యా సీజన్ మధ్యలోనే రాథోడ్ బయటికి వచ్చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us