Hanuman Movie: సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘హ‌నుమాన్’ అదనపు షోస్‌.. టైమింగ్స్ ఇవే

|

Jan 15, 2024 | 8:30 AM

హనుమాన్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా కథ, కథనాలు అబ్బుర పరిచే విజువల్స్‌, నటుల ప్రతిభ.. ఇలా అన్ని అంశాల్లోనూ హనుమాన్‌ అదుర్స్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది

Hanuman Movie: సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘హ‌నుమాన్’ అదనపు షోస్‌.. టైమింగ్స్ ఇవే
Hanuman Movie
Follow us on

 

హనుమాన్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా కథ, కథనాలు అబ్బుర పరిచే విజువల్స్‌, నటుల ప్రతిభ.. ఇలా అన్ని అంశాల్లోనూ హనుమాన్‌ అదుర్స్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా రాబట్టిన హనుమాన్‌ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్లగొడుతోందని ట్రేడ్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌ సినిమాకు పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. సంక్రాంతి బరిలో మహేశ్‌, వెంకటేశ్‌, నాగార్జున సినిమాలు ఉండడంతో హనుమాన్‌ సినిమాను చూద్దామనుకున్న అబిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రియులకు హనుమాన్‌ చిత్ర బృందం ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సినిమాకు భారీ రెస్పాన్స్‌ వస్తోన్న కారణంగా సోమవారం (జనవరి 15) నుంచి హనుమాన్‌ మూవీకి అదనపు మార్నింగ్‌ షోలను కలుపుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇది కేవలం తెలంగాణకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు షోస్‌ లపై ఎలాంటి అప్డేట్స్‌ లేవు.

ఇవి కూడా చదవండి

మరోవైపు హనుమాన్‌ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవ‌లం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు బుక్ అవ్వడం విశేషం. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. వినయ్‌ రాయ్‌ విలన్‌గా మెప్పించాడు. అలాగే రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సముద్ర ఖని, గెటప్‌ శీను, సత్య, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

తెలంగాణలో అదనపు షోస్..

రెండు రోజుల్లో 10 లక్షల టికెట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.