HanuMan OTT : హనుమాన్ ఓటీటీ పై లేటెస్ట్ బజ్.. సినిమా స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..

|

Feb 25, 2024 | 10:29 AM

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కుర్ర హీరో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథ హనుమంతుడి నేపథ్యంలో వచ్చింది. తక్కువ బడ్జెట్ లో భారీ వీఎఫ్ ఎక్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక సామాన్య యువకుడు హనుమంతుడి వల్ల సూపర్ పవర్స్ వస్తే అతను తన గ్రామాన్ని, ప్రజలను ఎలా కాపాడాడు అనే కథతో తెరకెక్కింది హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా  మూవీగా తెరకెక్కింది. 

HanuMan OTT : హనుమాన్ ఓటీటీ పై లేటెస్ట్ బజ్.. సినిమా స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..
Teja Sajja Hanuman
Follow us on

చిన్న సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు  ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బడా సినిమాలను బీట్ చేసి భారీ విజయాలను అందుకున్న సినిమాలు ఉన్నాయి. వాటిలో హనుమాన్ సినిమా ఒకటి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కుర్ర హీరో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథ హనుమంతుడి నేపథ్యంలో వచ్చింది. తక్కువ బడ్జెట్ లో భారీ వీఎఫ్ ఎక్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక సామాన్య యువకుడు హనుమంతుడి వల్ల సూపర్ పవర్స్ వస్తే అతను తన గ్రామాన్ని, ప్రజలను ఎలా కాపాడాడు అనే కథతో తెరకెక్కింది హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా  మూవీగా తెరకెక్కింది.

విడుదలైన అన్ని  భాషల్లో హనుమాన్ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచెజ్ లో వరుసగా సినిమాలు రానున్నాయి. హనుమాన్ తర్వాత జై హనుమాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో పెద్ద హీరో నటిస్తాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికే హనుమాన్ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. త్వరలోనే  హనుమాన్ సినిమా కూడా ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. హనుమాన్ సినిమా ఓటీటీ  రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ధరకు దక్కించుకుంది. త్వరలోనే హనుమాన్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని టాక్. మార్చి 2న హనుమాన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. కాగా ఈవార్తలు పై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.