నాని సినిమా పై కన్నేసిన జెనీలియా భర్త.. ఆ సినిమాను రీమేక్ చేస్తున్న రితేష్

|

Feb 25, 2024 | 11:28 AM

జెనీలియా భర్త రితేష్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రితేష్ దేశ్ ముఖ్ అప్పుడప్పుడు మరాఠీ సినిమాల్లో నటిస్తుంటారు. రితీష్ దేశ్‌ముఖ్ ఇప్పటివరకు రెండు మరాఠీ సినిమాల్లో మాత్రమే నటించారు. ఒకదానిలో విలన్‌గా, మరోదానిలో హీరోగా నటించాడు. రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన హీరోగా నటించిన ‘వేద్’ సినిమా మరాఠీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్ భార్య జెనీలియా హీరోయిన్ గా నటించింది.

నాని సినిమా పై కన్నేసిన జెనీలియా భర్త.. ఆ సినిమాను రీమేక్ చేస్తున్న రితేష్
Genelia And Riteish
Follow us on

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది అందాల భామ జెనీలియా. ఈ చిన్నది పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. చాలా కాలం తర్వాత భర్తతో కలిసి మొన్నామధ్య ఓ సినిమా చేసింది. ఇదిలా ఉంటే జెనీలియా భర్త రితేష్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రితేష్ దేశ్ ముఖ్ అప్పుడప్పుడు మరాఠీ సినిమాల్లో నటిస్తుంటారు. రితీష్ దేశ్‌ముఖ్ ఇప్పటివరకు రెండు మరాఠీ సినిమాల్లో మాత్రమే నటించారు. ఒకదానిలో విలన్‌గా, మరోదానిలో హీరోగా నటించాడు. రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన హీరోగా నటించిన ‘వేద్’ సినిమా మరాఠీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్ భార్య జెనీలియా హీరోయిన్ గా నటించింది.

మరాఠీ చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించిన ‘వేద్’ చిత్రం తెలుగులో నాగ చైతన్య, సమంత నటించిన ‘మజిలీ’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం మరాఠీ రీమేక్‌లో నిజ జీవితంలో భార్యాభర్తలు రితేష్, జెనీలియా నటించారు. రితేష్ దేశ్‌ముఖ్ ‘వేద్’ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం అలాగే నిర్మాతగా వ్యవహరించడం మరో ప్రత్యేకత.

ఇప్పుడు మరాఠీలో మరో సినిమా చేయాలని రితీష్ దేశ్‌ముఖ్ నిర్ణయించుకున్నాడు. ఈసారి కూడా తెలుగు సినిమా నుంచి రీమేక్‌కు ఓ సినిమానే ఎంచుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈసారి నాని సినిమా పై కనేశాడట ఈ హీరో. నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని మరాఠీలో రితీష్ దేశ్‌ముఖ్ రీమేక్ చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్‌లో రితీష్ దేశ్‌ముఖ్‌కి ​​ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సపోర్టింగ్ రోల్, యువ లీడ్ యాక్టర్స్ అన్న పాత్ర, తక్కువ గ్రేడ్ కామెడీ రోల్స్ ఇలా వస్తుండటంతో రితేష్ తన దృష్టిని పూర్తిగా మరాఠీ సినిమా వైపు మళ్లించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో తెలుగు సినిమాను మరాఠీలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఈ సినిమాతో రితేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.