
సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా నవ్వులు పూయించిన సుధీర్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న సుధీర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. సుదీర్ హీరోగా వేర్ ఈజ్ విద్యా బాలన్, నేనోరకం, సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, జ , కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడ్, కాలింగ్ సహస్త్ర వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు గోట్ అనే సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. G.O.A.T చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు.
సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకున్నాడు సుధీర్. కాగా నవ్వులు పూయించే సుధీర్ తాజాగా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. కారణం ఏంటంటే.. ప్రస్తుతం సుధీర్ ఓ డాన్స్ షో కు హోస్ట్ గా చేస్తున్నాడు. యాంకర్ గా నవ్వులు పూయించే సుధీర్.. ఓ డాన్స్ పర్ఫామెన్స్ చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. తన పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు సుధీర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే సుధీర్ ఎందుకు ఏడ్చేశాడంటే..
సుధీర్ తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకున్నాడు. తన దగ్గర ఆస్కార్ అనే పెంపుడు కుక్క ఉండేదని.. దాన్ని కుక్కలా కాకుండా ఇంట్లో మనిషిలా చూసేవాళ్ళం అని సుధీర్ తెలిపాడు. ఆ కుక్కకు ఓ అరుదైన జ్వరం వచ్చిందని దాంతో హాస్పటల్ కు తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాయని అని తెలిపాడు. ఆ జ్వరం తగ్గదు అని.. కొద్దిరోజుల్లోనే ఆ కుక్క చనిపోతుందని చెప్పారని అది విని తట్టుకోలేకపోయానని సుదీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.