AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story : థియేటర్‌లోనే కాదు ఓటీటీలోనూ అదే జోరు.. ఆహాలోనూ ‘లవ్ స్టోరీ’ని ఆదరిస్తున్న ప్రేక్షకులు..

నాగ చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్, శేఖర్ కమ్ముల టేకింగ్‌తో ‘లవ్ స్టోరి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

Love Story : థియేటర్‌లోనే కాదు ఓటీటీలోనూ అదే జోరు.. ఆహాలోనూ 'లవ్ స్టోరీ'ని ఆదరిస్తున్న ప్రేక్షకులు..
Love Story
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2021 | 1:21 PM

Share

Love Story : నాగ చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్, శేఖర్ కమ్ముల టేకింగ్‌తో ‘లవ్ స్టోరి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ బస్టర్ అయిన చిత్రంగా‘ల‌వ్‌స్టోరి’ నిలిచింది. ఇక  అక్టోబర్ 22 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.  ఈ క్రమంలో ఆహా టీం పైరసీ చేసే వారిని హెచ్చరించింది. ‘పైరసీని అరికట్టాలి. అందరూ ఆహాలోనే సినిమాను చూడండి. అది కూడా చాలా తక్కువ ధరలో అందిస్తున్నాం. రోజుకు ఒక్క రూపాయి చొప్పునే మీకు ఖర్చు అవుతుంది. మంచి క్వాలిటీతో సినిమాకు మీకు అందిస్తున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే డబ్బులు పెట్టి మనం ఎలా సినిమా చూస్తామో ఆహాలో లవ్ స్టోరీని చూడండి. ఆహాలో సబ్ స్క్రిప్షన్ చేసుకుని సినిమాను చూడండి’ అని ఆహా టీం కోరింది.

చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ‘ల‌వ్‌స్టోరి’ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌లో మా ప్రయత్నాన్ని ఆశీర్వదించారు. ఇప్పుడు సినిమా తెలుగు ఓటీటీ మాధ్యమమైన ‘ఆహా’లో  అందుబాటులోకి వచ్చింది . ఆహాలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు చూసి అనందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  ఇక థియేటర్స్‌లో  లవ్ స్టోరీ సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఓటీటీలో కూడా అదే ఆదరణ చూపిస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమాను పదే పదే చూస్తూ ఆనందిస్తున్నారు ప్రేక్షకులు. ఇక లవ్ స్టోరీ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడం పై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆహాలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది లవ్ స్టోరీ సినిమా..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Follow Us
టైఫాయిడ్, సైన్ ఫ్లూ‌కు ఇదే బెస్ట్.. నల్ల ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో
టైఫాయిడ్, సైన్ ఫ్లూ‌కు ఇదే బెస్ట్.. నల్ల ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో
గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే?
గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే?
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం
వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్
వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్
సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు
సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు
కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? దీని వల్ల లాభాలేంటి..?
కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? దీని వల్ల లాభాలేంటి..?
చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు..
చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు..
OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్
OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్
కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు! వీడియో
కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు! వీడియో
ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో వివాహం..?
ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో వివాహం..?